ట్రైలర్: మరొకసారి హీట్టు కొట్టేలా ఉన్న శివ కార్తీక్..!!

Divya
కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గత ఏడాది డాక్టర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అప్పటి వరకు వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉన్న శివకార్తికేయ డాక్టర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఆయన ఇమేజ్ మరింత రెట్టింపయ్యింది. కరోనా కారణంగా కొన్ని చిత్రాలు వాయిదా పడుతూ వస్తున్న అప్పటికీ ఆ గ్యాప్లో వీలైనంత త్వరగా తన సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్నాడు. తాజాగా శివ కార్తికేయ నటించిన కొత్త చిత్రం డాన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇందులో హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తున్నది. శిబి చక్రవర్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి థియేట్రికల్ ట్రైలర్ విడుదల కావడంతో మరింత హైప్ ను తీసుకు వచ్చింది. ఈ సినిమా ఫుల్  కామెడీ ఎంటర్ టైన్ మెంట్ గా కనిపిస్తున్నది. ఇక ఇందులో శివ కార్తికేయన్ ఒక కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తున్నారు ట్రైలర్ లో చాలా సన్నివేశాలు మొత్తం కాలేజీ బ్యాక్ డ్రాప్ లో నే తెరకెక్కించినట్లు గా కనిపిస్తున్నాయి.

అయితే ఎంతో కామెడీగా సాగే ఇటువంటి ఈ ట్రైలర్లో ఒక్కసారిగా ఎమోషన్ కు గురిచేస్తుంది అప్పటివరకు నవ్వించిన పాత్రలన్నీ ఒక్కసారిగా ఎమోషనల్ లోకి జారు కుంటాయి. శివ కార్తికేయన్ ఈసారి కూడా తన బలంతో కామెడీ తో మరొకసారి అలరించనున్న ట్లు గా కనిపిస్తోంది. ఇందులో ఎస్.జె.సూర్య కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు గా కనిపిస్తోంది. ఇక సముద్రఖని కూడా ఈ చిత్రంలో కనిపించారు. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్ర సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలు ఫ్లాప్ అవుతున్న సరే పాటలు మాత్రం మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఈ చిత్రం మే 13న విడుదలకు సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: