పెళ్లి , పిల్లల పై స్పష్టత ఇచ్చిన పూనమ్ కౌర్.. కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి అంటూ ట్వీట్..!!

Divya
పూనమ్ కౌర్.. ఇటీవల కాలంలో సినిమాలు లేకపోయినా సరే వార్తల్లో నిలిచే హీరోయిన్లలో ఈ ఉత్తరాది భామ పూనమ్ కౌర్ కూడా ఒకరని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ వివాదాస్పద వ్యాఖ్యలతో ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటుంది. ఎవరిని ఉద్దేశిస్తూ కామెంట్ చేస్తోందో కూడా అర్థం కాకుండా.. వారి పేరు కూడా మెన్షన్ చేయకుండా ట్వీట్లు చేస్తూ ప్రతిసారి అందరూ తన గురించి చర్చించుకునేలా చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఫోటో షేర్ చేసి వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ.. గత కొన్ని రోజుల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ కింద హ్యాపీనెస్ అనే క్యాప్షన్ ని కూడా జోడించింది.

ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాల కథలు అల్లేసారు.. ఎప్పుడు పెళ్లయింది.. అప్పుడే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా..? అంటూ కామెంట్లు కూడా చేశారు.. పూనం కౌర్ పెళ్లి,  పిల్లల గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించింది.. వాళ్ళిద్దరూ తన పిల్లలు కాదు అని.. ఇప్పటివరకు జరిగిన నష్టం చాలు అని.. కాస్త తనను బ్రతక నివ్వండి అంటూ ట్వీట్ చేసింది.. ఇక ఇప్పటి వరకు తనకు జరిగిన నష్టం చాలు.. ఈ ఫోటోలో ఉన్నది తన స్నేహితుల పిల్లలు అని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి అవకాశం ఇచ్చిన సోషల్ మీడియా కి కూడా ధన్యవాదాలు.. నన్ను కాస్త ఊపిరి పీల్చుకోనివ్వండి అంటూ దండం పెడుతున్న ఏమోజీ తో రాసుకొచ్చింది పూనమ్ కౌర్.

అయితే ఈ ట్వీట్ పై మరికొంత మంది నెటిజన్లు స్పందిస్తూ పోస్ట్ చేసినప్పుడే క్లారిటీగా చెప్పి ఉంటే ఇలాంటి చర్చలు జరిగేవి కాదు కదా అని కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె సరైన ఆఫర్లు లేక గత కొద్దిరోజుల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే తాజాగా నాతిచరామి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఇది కూడా డిజాస్టర్ గా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: