మేజర్ హవా గట్టిగానే మొదలు పెడుతున్నాడే..!!

P.Nishanth Kumar
అడివి శేష్ హీరోగా నటిస్తున్న మేజర్ సినిమా మే 27 లో విడుదల అవుతున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. శశికిరణ్ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరినీ అందులో అలరిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వివిధ రకాల జోనర్ లలో నటిస్తూన్న ఈ హీరో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటు ఉండగా అడవిశేష్ ఈ చిత్రంతో మరొక విజయాన్ని అందుకోవాలని ఎంతగానో ఆశిస్తున్నాడు.  పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు భాష తో పాటు తమిళ హిందీ భాషలలో సైతం విడుదల అవుతుండటం విశేషం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఉండటంతోనే ఈ సినిమా యొక్క స్టామినా ఏమిటో తెలిసిపోతుంది. సినిమాలో ఎంతో మ్యాటర్ ఉంటే తప్ప ఏదైనా సినిమా మహేష్ నిర్మించడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మహేష్ నిర్మించడం ఇప్పుడు అందరిలో ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తుంది. రియల్ హీరో ఉన్ని కృష్ణన్ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా కల్పిత సన్నివేశాలతో మరియు పాత్రలతో కమర్షియల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అప్డేట్స్ చిత్రం పై మంచి అంచనాలను పెంచుతుంది. 

తాజాగా ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో హీరో అడవి శేష్ చాలానే ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఒక సర్ప్రైజ్ ఇవ్వ పోతున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ట్వీట్ కూడా చేసి అందరిలో ఎంతో ఆసక్తి రేకెత్తించారు. ఈ సినిమా విడుదల సమయంలో ఇలాంటి సర్ప్రైజ్ లను ఇచ్చి తప్పకుండా ప్రేక్షకులను అలరించాలని అనేది శేష్ ఆలోచన. దీంతో ఈ సర్ప్రైజ్ ఎంటా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలోని కొన్ని కీలక పాత్రలు పరిచయం జరగాల్సి ఉంది. వాటిని కూడా ఎంతో వినూత్నంగా ప్లాన్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: