తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో బండ్ల గణేష్ ఒకరు. బండ్ల గణేష్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారారు. ఆంజనేయులు సినిమా తర్వాత గబ్బర్ సింగ్ , ఇద్దరమ్మాయిలతో, గోవిందుడు అందరివాడేలే, బాద్ షా వంటి పలు సినిమాలను బండ్ల గణేష్ నిర్మించాడు. ఇలా నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న బండ్ల గణేష్ ప్రస్తుతం డేగల బాబ్జి అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
తెలుగు స్క్రీన్ మీద మొదటి సారి సింగిల్ యాక్టర్ తో చేసిన సినిమా డేగల బాబ్జీ ఒకే చోట, సింగిల్ లొకేషన్ లో ఈ మూవీ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారు. ఒక్క వ్యక్తి మాత్రమే డేగల బాబ్జి మూవీ మొత్తం కనిపిస్తాడు. ఇకపోతే డేగల బాబ్జి సినిమాలో ఇంకా కొన్ని క్యారెక్టర్లు ఉన్నప్పటికీ ఆ పాత్రల వాయిస్ మాత్రమే ఈ మూవీలో వినిపిస్తుంది తప్ప మనుషులు మాత్రం కనిపించరు. కోలీవుడ్ లో నేషనల్ అవార్డ్ పొందిన "ఉత్త సిరుప్పు సైజు 7" మూవీ ని తెలుగులో డేగల బాబ్జీ గా రీమేక్ చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో బండ్ల గణేష్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఈ
సినిమాకు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు వెంకట్ చంద్ర కు ఇది మొదటి సినిమా. రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర డేగల బాబ్జి మూవీ ని నిర్మించారు. ఇది ఇలా ఉంటే డేగల బాబు చిత్ర బృందం తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. డేగల బాబ్జి సినిమాను మే 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరి డేగల బాబ్జి సినిమా తో బండ్ల గణేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.