విశ్వక్ సేన్ ను వెధవ అంటూ గెంటేసిన టాప్ యాంకర్... అసలేమైంది ?

VAMSI
ఒక సినిమా విడుదల అవుతుంది అంటే దానికి సంబందించిన ప్రమోషన్స్ జరగటం కూడా సినీ ఇండస్ట్రీలో సర్వ సాధారణం. అయితే మరో 4 రోజుల్లో రానున్న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాకి కూడా అలాగే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఆ సినిమా హీరో విశ్వక్ సేన్ ఒక ప్రాంక్ వీడియో చేయటం జరిగింది. అయితే ఈ వీడియోను విశ్వక్ నిన్న ఒక యువకుడితో కలిసి నడిరోడ్డుపై చేయటంతో ఆ వీడియో కాస్తా వైరల్ కావటంతో నెటిజన్లు తమ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇందులో భాగంగా ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ విశ్వక్ ని ఇంటర్వ్యూ కు పిలిచి ఘోరంగా అవమానించింది. దీనితో ఇప్పుడు ఇదో పెద్ద హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది.

వివరాల్లోకి వెళితే.. అసలు సినిమా ప్రమోషన్స్ పేరుతో ఇలా రోడ్లపైన ఇలాంటి న్యూసెన్స్ చేస్తూ ,పబ్లిక్‌కు అంతరాయం కలిగించటం తప్పు అంటూ పలువురు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ హీరో పైన న్యూసెన్స్ కేసును నమోదు చేశారు. మరి ఈ వివాదంపై తన అభిప్రాయాలను తెలుసుకోవటం కోసం విశ్వక్ ని డిబేట్ కి పిలిచింది ఓ ప్రముఖ టీవీ ఛానెల్ . అయితే ఆ డిబేట్ లో ఒక హీరో అయ్యుండి అసలు మీరు ఇలా ఎలా చేస్తారు.. పాగల్ సేన్ , డిప్రెస్డ్ పర్సన్ అంటూ ఆ యాంకర్ విశ్వక్ ని అంటుంది.  ఇక ఆమె అన్న మాటలకు విశ్వక్ హార్ట్ అవ్వటమే కాకుండా ఆ యాంకర్ పై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

అలాంటి మాటలు అసలు తనకి నచ్చవని తనను ఆలా అనవద్దని.. అలాగే చెప్పేది అర్ధం చేసుకోని, తన మాటలను కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ కొంచెం గట్టిగా అరుస్తూ చెప్తాడు. దానితో ఆగ్రహం చెందిన ఆ  ఛానల్ యాంకర్  గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని గట్టిగట్టిగా అరుస్తూ చెప్పింది. దీనితో ఆగ్రహానికి గురియైన విశ్వక్ మీరే ఇంటర్వ్యూ కి పిలిచి, నన్ను మాటలు అంటూ అవమానిస్తున్నారు అంటూ ఆమెను అసభ్య పదజాలంతో మాట్లాడారు. అంతటితో అయినా ఆగని ఆ యాంకర్ కూడా హీరోను వెధవ నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళితే మంచిది అంటూ అరుస్తూ  ఒక సంచలనం సృష్టిస్తుంది.

దీనితో విసుగు చెందిన విశ్వక్ చివరికి నా గురించి మీకు నచ్చినట్లు మాట్లాడుకోండి అంటూ కోపంతో మైక్ ని విసిరి కొట్టి వెళ్ళిపోవటం వరకు మనకు వీడియోలో కనిపిస్తుంది. అయితే  ప్రస్తుతం ఈ వీడియో కూడా నెట్టింట తెగ వైరల్ గా మారి హల్చల్ చేస్తుంది. అంతేకాదు  కొంతమంది ఇది కూడా ప్రాంక్ అనే భావనలో ఉండగా.... మరి కొందరు  మాత్రం ఒక ఛానెల్ అయ్యుండి అందులోను లైవ్ జరగుతుండగా ఇంత అసభ్యకరంగా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు లేదా మీకు అంటూ తమ యొక్క ఆగ్రహం వ్యక్తం పరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: