తరుణ్ భాస్కర్ కొత్త స్కెచ్ ఇరానీ టీ ట్విస్ట్ ట్రంప్ వీడియోతో సినిమా ప్రమోషన్ అదిరింది!
ట్రంప్‌తో తరుణ్ భాస్కర్ ‘టీ’ ముచ్చట్లు!
సినిమా ప్రమోషన్ల కోసం తరుణ్ భాస్కర్ ఏకంగా ఏఐ (AI) టెక్నాలజీని వాడేశారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టీ తాగుతూ.. "ఇండియన్ టీ వెరీ నైస్" అని పొగిడే ఫన్నీ వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. దానికి తరుణ్ భాస్కర్ కౌంటర్ ఇస్తూ.. "మీరు తాగింది ఇండియన్ టీ కాదు బాబాయ్.. అది ఇరానీ టీ" అని షాక్ ఇవ్వడం, ఆ తర్వాత ట్రంప్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అమెరికా ప్రెసిడెంట్ నిర్ణయం.. కుర్రాడి జీవితం అల్లకల్లోలం!
అసలు ట్రంప్‌ను ప్రమోషన్లలోకి ఎందుకు తెచ్చారనే దానికి ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఒక సామాన్య యువకుడి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఆ నిర్ణయం అతడిని ఎలా ‘గాయపడ్డ సింహం’లా మార్చింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకే ప్రమోషన్లలో కూడా ట్రంప్ పేరును హైలైట్ చేస్తూ మేకర్స్ అదిరిపోయే స్కెచ్ వేశారు.ఈ సినిమాను ఓవర్‌సీస్‌లో ప్రముఖ సంస్థలు ఎస్‌వీసీ (SVC) మరియు ప్రత్యుంగిరా సినిమాస్ భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాయి. ఇరాన్‌లో మాత్రం ఈ సినిమాను రిలీజ్ చేయడం లేదని చెబుతూనే, ఆ టీ వీడియోతో ఒక సెటైరికల్ టచ్ ఇచ్చారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా, ఒకరోజు ముందుగానే అంటే ఏప్రిల్ 30నే విదేశాల్లో సందడి చేయనుంది.
ఫరియా - తరుణ్ కాంబో మ్యాజిక్!
తరుణ్ భాస్కర్ యాక్టింగ్ గ్రేస్, ఫరియా అబ్దుల్లా గ్లామర్ ఈ సినిమాకు పెద్ద అసెట్. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్‌తో వస్తున్న ఈ సినిమా, యువతను ముఖ్యంగా ఓవర్‌సీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రమోషన్ల జోరు చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద 'గాయపడ్డ సింహం' వేట గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది.