ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ సినిమా వచ్చేది అప్పుడే.. రిలీజ్ డేట్ లాక్..!
అలాగే ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటు టీజర్ డేట్ కూడా తెలియజేశారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం పైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 11 జూన్ 2027 విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్లో కూడా ఎన్టీఆర్ ఒక షాడో లుక్ లో చాలా పవర్ ఫుల్ గా కనిపించారు. మే 20వ తేదీన ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించడంతో అభిమానులు కూడ ఖుషీ అవుతున్నారు.
ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు సుమారుగా రూ .350 కోట్ల రూపాయలు బడ్జెట్ తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలోని పాత్ర కోసం ఏకంగా 20 కేజీల వరకు బరువు తగ్గారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్ల నటిస్తూ ఉండగా అలాగే మరో హీరోయిన్ ఆలియా భట్ ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తోందని ప్రచారం అయితే జరుగుతోంది. మరి త్వరలోనే అన్ని విషయాల పైన అధికారి వస్తుందేమో చూడాలి.