యాక్టర్ హేమ విషయంలో తప్పు చేశా.. వీడియో విడుదల చేసిన తమన్నా..!

Divya
టాలీవుడ్ లో ఒకప్పుడు యాక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మధ్యకాలంలో అవకాశాలు చాలానే తగ్గిపోయాయి అందుకు కారణం ఈమె పైన వచ్చిన డ్రగ్స్ కేసు వివాదం వల్ల అవకాశాలు తగ్గిపోయాయనే విధంగా వినిపిస్తున్నాయి. అయితే ఆ సమయంలో హేమ తాను ఏ తప్పు చేయలేదని మీడియా ముందుకు వచ్చి ఎంత పోరాడినా కూడా కొన్ని మీడియా చానల్స్ సైతం ఈమె పైన విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత బెంగళూరు హైకోర్టు హేమ కు క్లీన్ చీట్ ఇవ్వడంతో ఆమె ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరి తాను తప్పు చేయలేదని మరొకసారి నిరూపించుకున్నానని తెలియజేసింది.


అయితే హేమ పైన వచ్చిన డ్రగ్స్ కేసు వివాదంలో అప్పట్లో ప్రముఖ బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి కూడా చాలా అసభ్యకరంగా మితిమీరి మరి నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ఆ సమయంలో ప్రముఖ నటి కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి పై కూడా క్రిమినల్ కేసు పెట్టి మరి పరువు నష్ట ధావా వేసింది నటి హేమ. ఇప్పుడు తాజాగా హేమ విషయంలో తన తప్పు తెలుసుకున్న తమన్నా తాను హేమక్క విషయంలో తప్పు చేశానని సోమవారం ఒక వీడియో ద్వారా తనని క్షమించమని కోరింది తమన్నా సింహాద్రి. అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.



సారీ హేమక్క.. అందరూ నీ మీద బురద జల్లుతున్నప్పుడు నేను మీ వైపు నిలబడాల్సి ఉన్నది కానీ నేను కూడా వారితో కలిసిపోయి మరి నీ పైన బురదజల్ల, ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను నేను చేసిన దానికి పశ్చాత్తాపడుతున్నాను నన్ను ఇప్పటికైనా క్షమించండి అంటూ తమన్నా ఒక వీడియోని విడుదల చేసింది. మరి ఈ విషయం పైన నటి హేమ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: