నమ్రత చేతిపై పునీత్ రాజ్ కుమార్ టాటూ ...

VAMSI
కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ ఈ లోకాన్ని విడిచి వెళ్లి తన అభిమానుల్ని దుఃఖ సంద్రంలో ముంచేశారు. ఆయన ఈ ప్రపంచాన్ని కాదని వెళ్లి ఆరు నెలలు గడుస్తోంది, అయినా ఆయన్ని మరచిపోవడం అంత సులువైన పని కాదు. అసలు అభిమానులకు అయితే అది ఎప్పటికీ సాధ్యపడదు. అంతగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు పునీత్. సామాన్య ప్రజల్నే కాదు ఆయన మంచితనం, గొప్పతనంతో స్టార్స్ ను కూడా తన ఫ్యాన్స్ గా మార్చుకున్న మహానుభావుడు. గతేడాది అక్టోబర్‌ 29న ఈయన మనకు దూరమయ్యారు. అప్పుడు శాండిల్వుడ్ మాత్రమే కాదు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు సైతం ఈయనకు నివాళులు అర్పిస్తూ తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒక వ్యక్తి గొప్పవాడు, ఉత్తముడు అని మనిషి ఉన్నప్పుడు కాదు లేనప్పుడు కూడా చెప్పించుకోగలగాలి అపుడే అది నిజమైన కీర్తి అనిపించుకుంటుంది. పునీత్ కు అంతకంటే ఎక్కువగానే దక్కిందని చెప్పాలి. ఆయన జీవించింది కొన్నాళ్లే అయినా ఈ సమాజం కోసం ఎంత చేశారో తెలుసా... 45 స్కూళ్లు కట్టించారు, 26 అనాథ శ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్ నడిపించేవారు, 19 గోశాలలకు సాయం చేస్తూ మూగ జీవాలకు అండగా నిలబడ్డారు. జీవించినపుడే కాదు మరణించాక కూడా ఈ సమాజానికి ఉపయోగపడాలి అని చనిపోయినా రెండు కళ్ళు దానం చేశారు పునీత్ నిజంగా ఈయన పునీతుడే. ఇంత చేసినా ఏనాడు పబ్లిసిటి చేసుకోలేదు, ఎవరి మెప్పు కోరలేదు. ఆయన చేస్తున్న సాయం గురించి ఆయన మరణించాకే ఈ ప్రపంచానికి తెలిసింది.

అలాంటి ఈ మహావ్యక్తి మరణాన్ని జీర్ణించుకోలేని ఒక సెలబ్రిటీ ఆయన పేరును పచ్చబొట్టు వేయించుకుంది. అలా ఆయనపై ఉన్న అభిమానాన్ని జ్ఞాపకంగా మార్చుకుంది.  పునీత్ కన్నడ మూవీ అయినా నమ్రత పునీత్‌ మిలనా చిత్రంలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించిన నమ్రత ఇపుడు పునీత్ పేరును తన చేతిపై టాటూగా వేయించుకుంది. ఈమె టెలివిజన్ నటి కూడా... పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా పచ్చబొట్టును వేయించుకుని ఆ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పునీత్ ఎప్పటికీ గుర్తుండి పోతారు అంటూ టాగ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పునీత్ అభిమానులు తమ అభిమాన తారను మరో సారి గుర్తు చేసుకుంటూ ప్రేమతో కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: