టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కిరణ్ అబ్బవరం గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కిరణ్ అబ్బవరం 'రాజా వారు రాణి వారు' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ పర్వాలేదు అనే రేంజ్ లో విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం 'ఎస్ ఆర్ కళ్యాణ మండపం' సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కిరణ్ అబ్బవరం కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
ఇది ఇలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం సెబాస్టియన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.
సమ్మతమే సినిమాను జూన్ 24 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ బయటకు వచ్చింది. తాజాగా సమ్మతమే చిత్ర బృందం ఈ సినిమా టీజర్ ను మే 1 వ తేదీన ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సమ్మతమే సినిమాను యూజీ ప్రొడక్షన్స్‌లో కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు.