జుట్టు పీక్కుంటున్న బాలీవుడ్ దర్శక నిర్మాతలు ?

VAMSI
తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు దేశమంతా మారుమ్రోగిపోతోంది. కేవలం ఒక నెల రోజుల కాలంలో రెండు పెద్ద సినిమాలు వచ్చాయి సౌత్ సినిమా సత్తా ఏమిటో నిరూపించి మిగిలిన ఇండస్ట్రీల భవిష్యత్తు ఏమిటా అని ఆలోచించుకునేలా చేశాయి. అయితే టాలీవుడ్ ఆర్ ఆర్ ఆర్ వచ్చి 1500 కోట్లకు దగ్గరగా కలెక్షన్ లు సాధిస్తోంది. ఇక కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన కేజీఎఫ్ 2 అనే మూవీ అయితే ఆర్ ఆర్ ఆర్ కు ధీటుగా పోటీ ఇస్తూ కలెక్షన్ లను సాధిస్తూ అద్భుతంగా ప్రదర్శించబడుతోంది. టాలీవుడ్ శాండల్ వుడ్ తప్ప మిగిలిన అని ఇండస్ట్రీలు నిరాశలో ఉన్నాయి. ఇక ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు అయితే టాలీవుడ్ ను చూసి సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే ఇందులో టాలీవుడ్ కు పోటా పోటీగా వచ్చే బాలీవుడ్ పై ఎక్కువ ఒత్తిడి పడిందని చెప్పాలి.

ఇక టాలీవుడ్ సినిమా ప్రభావంతో బాలీవుడ్ వాళ్ళు ఇక ఎటువంటి సినిమాలను తెరకెక్కించాలి అన్న విషయంపై తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన చిత్రాలు కూడా నాసిరకం కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక చతికిలపడ్డాయి. దీనితో డైరెక్టర్లు మరియు నిర్మాతలు తలలు పీక్కుంటున్నారు.

అయితే ఈ సంక్షోభం నుండి బయట పడాలంటే మంచి మాస్ మసాలా స్ట్రాంగ్ కథలతో స్టార్ హీరోల నుండి సినిమాలు రావాల్సిందే అన్ని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే బాలీవుడ్ లో కింగ్ లు గా ఉన్న షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ మరియు అక్షయ కుమార్ లు ఈ తరహా కథలపై దృష్టి పెట్టాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. మరి ముందు ముందు అయినా బాలీవుడ్ టాలీవుడ్ ను తట్టుకుని నిలబడుతుందా అన్నది తెలియాలంటే ఒకటి రెండు సినిమాలు వచ్చే వరకు ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: