ఆమెకు మహేష్ అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడా..!!

P.Nishanth Kumar
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు మరియు ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తరువాత వీరి కలయికలో రాబోతున్న ఈ సినిమా కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని వారి అభిమానులు భావిస్తున్నారు. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక కాగా ఈ సినిమాలో మరోక హీరోయిన్ గా ఉంటుంది అని మొదటి నుంచి చిత్రయూనిట్ చెబుతూ వచ్చింది. ఆ పాత్రకు హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

నిజంగా ఇది మంచి అవకాశం అని చెప్పాలి. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. అరుకు పైగా క్రేజీ ప్రాజెక్టులు ఇప్పుడు ఆమె చేతిలో ఉన్నాయి అంటే ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మహేష్ సరసన నటించే అవకాశాన్ని అందుకోగా ఆమెకు ఈ సినిమా తప్పకుండా మంచి క్రేజ్ తెచ్చిపెడుతుంది అని చెప్పవచ్చు. మొదట్లో ఈ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమె అభిమానులు ఈ సినిమా చేయడం అవసరమా అన్నట్లు గా ఆమెను ప్రశ్నించారు.

ఏదో గ్లామర్ కోసమే ఆమెను ఎంపిక చేశారు అనేది ఆమె అభిమానుల మాట. ఆ వ్యాఖ్యలను గమనించిన దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో ఆమె పాత్ర ను పూర్తిగా చేంజ్ చేశారట. ఒక పాటను కూడా ఇవ్వడంతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా ఆమెకోసం రాస్తున్నారట. ఈ విధంగా మహేష్ సినిమాలో మంచి సీన్స్ లో పాల్గొననుంది. త్రివిక్రమ్ సినిమాలలో మెయిన్ హీరోయిన్ తో పాటు మరో హీరోయిన్ కూడా పెట్టుకుంటాడు. అలా అన్ని సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలతో చాలా మంది హీరోయిన్ లు సందడి చేశారు. అయితే అలా కాకుండా ఈ సినిమా లో శ్రీ లీల కు మంచి ప్రాధాన్యత ఉంటుంది అని చెబుతున్నారు. మరి ఈ బ్యూటీకి ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఈ సినిమా కోసం వేచి చూడవలసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: