వెంకటేష్ హీరోయిన్ కి తప్పని క్యాస్టింగ్ కౌచ్.. హీరో ఎవరంటే..!!
ఇండస్ట్రీలో ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో నటిస్తూ వస్తోంది ఇషా కొప్పికర్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ముద్దుగుమ్మ కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపింది. ఆమెకు చాలా సంవత్సరాల క్రితం ఎదురైన ఒక దుర్ఘటనమైన సంఘటన గురించి తెలియజేసింది. ఆ సంఘటన తన జీవితం లోనే కాకుండా వ్యక్తిగత జీవితం లో కూడా తనకు ఎంతో బాధ కలిగించేలా చేసినట్లుగా తెలియజేసింది. ఇక ఆమె మాట్లాడుతూ ఒక స్టార్ హీరో తో సినిమా కన్ఫామ్ అయ్యింది.. ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి.
అలా జరుగుతున్న సమయంలోనే ఆ హీరో తనని ఒంటరిగా కలవాలన్నాడట. అయితే ఆ హీరో ఉద్దేశం తనకు అర్థం అవ్వడంతో ఆయన తీరుపై ఈమె చాలా కోప్పడ్డానని తెలియజేసింది. అలా ఒంటరిగా కలవలేదని ఆ సినిమా నుండి తనను తప్పించారని తెలియజేసింది. ఈ సంఘటన తను ఎప్పటికీ మర్చిపోలేను అని తెలియజేసింది. హీరోయిన్గా ఇండస్ట్రీలోకి కొత్తవారు ఎంట్రీ కావాలి అంటే ఇలాంటి ఎన్నో దారుణాలు చూడాల్సి ఉంటుంది అని తెలియజేసింది. సినీ ఇండస్ట్రీ లో ఉండే హీరో లే కాకుండా అక్కడ ఉండే దర్శక నిర్మాతలు , పోస్ట్ ప్రొడక్షన్ పనులవారు సైతం ఏదో విధంగా వాడుకోవాలని చూస్తూ ఉంటారని తెలియజేసింది.