టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన కార్తికేయ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఎక్స్100 మూవీ తో హీరోగా పరిచయం అయిన కార్తికేయ మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత అనేక సినిమాలలో నటించిన కార్తికేయ కు ఆర్ ఎక్స్100 రేంజ్ విజయం మాత్రం ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర దక్కలేదు. కార్తికేయ సినిమాలో కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించాడు. నాని హీరోగా తెరకెక్కిన నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమా లో కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు.
అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై సినిమాలో కూడా కార్తికేయ విలన్ పాత్రలో నటించాడు. ఈ సినిమా కార్తికేయ కు కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ను తీసుకొచ్చింది. ఇలా హీరో పాత్రలతో, విలన్ పాత్రలతో మెప్పిస్తూ వస్తున్నా కార్తికేయ తాజాగా తన కొత్త సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాలో కార్తికేయ సరసన డీజే టిల్లు సినిమాలో హీరోయిన్ గా నటించిన నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. కార్తికేయ , నేహా శెట్టి జంటగా నటిస్తున్న సినిమా తాజాగా ప్రారంభమయ్యింది.
ఈ మూవీ ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. కలర్ ఫొటో , తెల్లవారితే గురువారం లాంటి మొవీల తర్వాత ఆయన నిర్మిస్తున్న మూవీ ఇది. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కాన్సెప్ట్ పోస్టర్ ను విడుదల చేయడంతో పాటు రెగ్యులర్ ఈ మూవీ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే కార్తికేయ, నేహా శెట్టి మొదటి సారి కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు.