ఆచార్య కు సహకారం అందించిన మహేష్ !

Seetha Sailaja
రెండు సంవత్సరాల క్రితం ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మహేష్ పిలవగానే మరోమాట లేకుండా చిరంజీవి ఆనాటి ఈవెంట్ కు అతిధిగా రావడమే కాకుండా మహేష్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించాడు. ఇప్పుడు ఆ ఋణాన్ని ‘తాను లావైపోతాను’ అన్న భయంతో మహేష్ తీర్చుకోబోతున్నాడు.



‘ఆచార్య’ మూవీ కథలో ఆకథను నడిపించడానికి ఒక వాయస్ ఓవర్ కావాలట. ఆ వాయస్ ఓవర్ ఎవరితో చెప్పించాలి అని కొరటాల ఆలోచిస్తున్నప్పుడు మహేష్ పేరు స్వయంగా చిరంజీవి సూచించడం వెనువెంటనే కొరటాల మహేష్ ను సంప్రదించడం మహేష్ వచ్చి తన వాయస్ ఓవర్ డబ్బింగ్ పూర్తి చేయడం ఈపనులు అన్నీ కేవలం రెండు రోజులలో జరిగిపోయాయట. వాస్తవానికి ‘ఆచార్య’ కథ అనుకున్నప్పుడు చిరంజీవి పక్కన ప్రస్తుతం చరణ్ చేసిన సిద్ద పాత్రను మహేష్ తో చేయించాలి అనుకున్నాడు అని అంటారు.





అయితే ఈమూవీ కథకు సంబంధించి మహేష్ బదులు ఆ పాత్రను చరణ్ తో చేయిస్తే మెగా అభిమానులకు పండుగగా ఉంటుందని చిరంజీవి భావించడంతో మహేష్ స్థానంలో చరణ్ వచ్చి చేరాడు. దీనికోసం ఏకంగా చిరంజీవి అప్పట్లో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో ఉన్న చరణ్ ను తనకు ఇమ్మనీ చిరంజీవి కోరడంతో  రాజమౌళి కాదనలేకపోయాడు అని అంటారు. దీనితో ‘ఆచార్య’ లో మహేష్ కు నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.



అయితే ఇప్పుడు మహేష్ గొంతు ‘ఆచార్య’ మూవీ ధియేటర్లలో ప్రపంచ వ్యాప్తంగా వినిపించ బోతోంది ఒకవిధంగా మహేష్ అభిమానులకు పండుగ. ఈసినిమా భారీ ఓపెనింగ్స్ కు మహేష్ అభిమానుల సహకారం కూడ లభించే అవకాశం ఉంది. రేపు యూసఫ్ గుడా లోని భారీ గ్రౌండ్ లో జరగబోతున్న ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అత్యంత భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఫంక్షన్ కు రాజమౌళి రావడం ఖరార్ అయినప్పటికీ పవన్ ఈ ఈవెంట్ కు అతిధిగా వచ్చే విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: