ఈ స్టార్ హీరోలలో ఇసుమంత కూడా గర్వం లేదంటే నమ్మగలరా?
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ తేజ్. ఇతను అచ్చం తండ్రి లగే అన్ని గుణాలను పుణికిపుచ్చుకున్నాడు. ఆయనలాగే మృధుస్వభావి, మంచి మనిషి, పరోపకారి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే రామ్ చరణ్ కు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈయన నలుగురిలో చాలా సింపుల్ గా ఉంటారు, ఎదుటివారు ఎవ్వరైనా గౌరవించే గొప్ప మనసున్న వ్యక్తి రామ్ చరణ్.
ఇక అదే మెగా కాంపౌండ్ నుండి నామాలు నేర్చుకుని ఇప్పుడు స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న మరో హీరో అల్లు అర్జున్. ఇతను కూడా తన మామ లాగే మంచి లక్షణాలు అలవర్చుకున్నారు. షూటింగ్ లో కానీ బయట కానీ ఎవ్వరితోనూ వివాదాలు పెట్టుకునే వ్యక్తి కాదు. చాలా సింపుల్ గా అందరితోనూ కలివిడిగా ఉంటారు. అల్లు అర్జున్ లో గర్వానికి కొంచెం కూడా స్థానం లేదని ఇప్పటికే చాలా సార్లు ఈయన ప్రవర్తించిన తీరు చూసి మనము తెలుసుకున్నాము.
ఇప్పుడు పైన మనము చెప్పుకున్న ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో ఇంతగా పేరు తెచ్చుకోవడానికి కారణం వీరిలో ఉన్న మంచి గుణాలు అని చెప్పవచ్చు. ప్రస్తుతం వీరిద్దరూ కూడా టాప్ హీరోలుగా వెలుగుతున్నారు. ఈ మధ్యనే అల్లు అర్జున్ పుష్ప తో మరియు రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమాలతో హిట్ కొట్టి కెరీర్ లో హ్యాపీగానే ఉన్నారు.