టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ తన సినిమా కెరియర్ ను చిన్న చిన్న పాత్రల ద్వారా మొదలు పెట్టినప్పటికీ పెళ్లిచూపులు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నడు. పెళ్లి చూపులు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. లైగర్ మూవీ పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కుతోంది.
ఇలా ఒక సినిమా సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ మరో సారి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన అనే సినిమాలో నటించబోతున్నాడు. జనగణమన మూవీ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల నుండే విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతోంది అంటూ అనేక వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ మధ్యన కొంత కాలం విజయ్ దేవరకొండ తన సినిమాలతో బిజీగా ఉండటం, శివ నిర్వాణ టక్ జగదీష్ సినిమాతో బిజీగా ఉండడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కే అవకాశం లేదంటూ కూడా వార్తలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది వరకే విజయ్ దేవరకొండ, సమంత కలిసి మహానటి సినిమాలో నటించారు. ఇది ఇలా ఉంటే లైగర్ సినిమా సెట్స్ పై ఉండగానే విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ రెండు సినిమాల లైనప్ ను సెట్ చేసి పెట్టుకున్నాడు.