బాహుబలి సినిమాతో
ప్రభాస్ పనిండియా స్టార్ అయినట్టు ...తాజాగా ఇప్పుడు
కేజీఎఫ్ సినిమాతో యశ్ కూడా
సూపర్ స్టార్ అయిపోయాడు.అయితే ప్రస్తుతం ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఇకపోతే మరీ ముఖ్యంగా ఇటీవల విడుదలైన
కేజీఎఫ్ రెండో పార్ట్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో రాకింగ్ స్టార్ కేవలం శాండిలవుడ్లోనే కాకుండా దేశమంతటా బర్నింగ్ టాపిక్ అయిపోయాడు. అయితే అసలు
కన్నడ సినిమా ఇండస్ట్రీని రెండేళ్ల కిందటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. ఇక అలాంటి
ఇండస్ట్రీ నుంచి వచ్చిన
హీరో ఏకంగా మొదటిరోజే 170 కోట్ల వసూళ్లు తీసుకురావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇకపోతే
హిందీ సినిమా రికార్డులను కూడా
కేజీఎఫ్ చాప్టర్ 2 బద్దలు కొడుతున్న తీరు చూసి ట్రేడ్ పండితులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటే తాజాగా
యష్ డైరెక్ట్ తెలుగు
సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈయన కోసం ఒక అగ్ర దర్శకుడు కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే నాలుగేళ్ల కిందట విడుదలైన
కేజీఎఫ్ మొదటి భాగం తెలుగులో కేవలం రూ.20 కోట్లు మాత్రమే వసూలు చేసింది.ఇక ఇప్పుడు మాత్రం రూ.100 కోట్ల వైపు అడుగులు వేసేలా కనిపిస్తోంది. అయితే రాఖీ భాయ్ బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనాలు చూసిన తర్వాత ఆయనతో నేరుగా తెలుగు
సినిమా చేయాలని నిర్మాతలు ఆశ పడుతున్నారు.
ఇకపోతే ఈ క్రమంలోనే ఒకరిద్దరు అగ్ర దర్శకులు
యష్ ను కలిసి తమ ఐడియాలను కూడా షేర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా వీటిపై
కన్నడ రాకింగ్ స్టార్ కూడా ఆసక్తిగానే ఉన్నాడు.అయితే ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయిన తర్వాత తెలుగులో నటించడానికి తనకేమీ అభ్యంతరం లేదని
యష్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇక వీలైనంత త్వరగా తెలుగు సినిమాపై క్లారిటీ రానుంది. అయితే ఆ మధ్య ఒకసారి
పూరి జగన్నాథ్ జనగణమన
సినిమా ఈయనతోనే చేయాలి అనుకున్నాడు.. కానీ అది కుదరలేదు.ఇదిలావుంటే ప్రస్తుతం
విజయ్ దేవరకొండ హీరోగా ఇది తెరకెక్కుతోంది...!!