వైష్ణవ్ తేజ్ ఎందుకని ఇలా !
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ‘ఉప్పెన’ కు 100 కోట్ల కలక్షన్స్ రావడంతో ఇక ఈహీరోకు తిరుగులేదు అనుకున్నారు అంతా. అయితే అతడు నటించిన రెండవ సినిమా ‘కొండపొలం’ మూవీకి కనీసపు ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రాకపోవడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అయ్యాయి. ఇప్పుడు ఈయంగ్ హీరో నటిస్తున్న సినిమాల లిస్టు చూస్తుంటే ఈ హీరో సరైన కథను ఎంచుకోవడంలో తప్పటడుగు వేస్తున్నాడా అన్న సందేహాలు కల్గుతున్నాయి.
ప్రస్తుతం ఈయంగ్ హీరో నటిస్తున్న సినిమాలు అన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు కావడంతో ఒకే తరహా సినిమాలను ఈ యంగ్ హీరో నుండి వరసగా వస్తే ప్రేక్షకులు చూస్తారా అన్న సందేహాలు కల్గుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా ఇతడు ‘రంగ రంగ వైభవంగా’ అన్న మూవీని చేస్తున్నాడు. ఈమూవీకి గిరీషాయ అన్న కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తూ ఉంటే కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీ కూడ కాన్సెప్ట్ మూవీ ఓరియంటెడ్ మూవీ అంటున్నారు.
ఇండస్ట్రీలోని హీరోలు అంతా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలను ఎంచుకుంటూ మాస్ ప్రేక్షకులకు దగ్గర అవుతుంటే ఈయంగ్ హీరో ఇలాంటి కథలను ఎందుకు ఎంచుకోవడం లేదు అన్న సందేహాలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ఒక యంగ్ డైరెక్టర్ సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ లతో కలిపి ఒక మల్టీ స్టారర్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఒక కథను రెడీ చేస్తున్నట్లు టాక్.
ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ ఈమూవీని తీయడానికి ముందుకు వస్తోంది అని అంటున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ వైష్ణవ్ తేజ్ ల మార్కెట్ అంతంత మాత్రంగానే ఉంది. దీనితో వీరిద్దరూ ప్రస్తుతం నడుస్తున్న పోటీలో చెరొక హిట్ పొందలేకపోతే వీరిద్దరి పరిస్థితి ఏమిటి అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే వీరి మేనమామలు చిరంజీవి పవన్ లు మాత్రం వీరిద్దరి కెరియర్ ను నిలబెట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు..