మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన సినిమా ఆచార్య, ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఆచార్య సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనుం డగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని పాటలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది, ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి ఈ రోజు మరొక పాటను చిత్ర బృందం విడుదల చేయనున్నది.
ఇది ఇలా ఉంటే ఆచార్య సినిమాను ఏప్రిల్ 29 వ తేదీన విడుదల చేయనున్నారు, ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఇప్పటికే ఈ సినిమా నుండే చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఆచార్య సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది, ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్ లో మిలియన్ ల కొద్దీ వ్యూస్ ను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఫంక్షన్ భారీ ఎత్తున ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది, ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను ఈ నెల 23 వ తేదీన హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.