మెగాస్టార్ చిరంజీవి, రాధిక కలిసి అలనాటి కాలంలో ఎన్నో హిట్, సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించారు, వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాధిక సినిమా లలో తల్లి పాత్రల్లో నటిస్తోంది, ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రాధిక , చిరంజీవి మూవీ లో విలన్ గా చేయడానికి రెడీ కానీ తల్లి పాత్రలో మాత్రం చేయను అని రాధిక చెప్పేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూ కు వచ్చిన రాధిక , చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది, తాజాగా ఓ షో కు విచ్చేసిన రాధిక ఒక మూవీ లో చిరంజీవి ని కొట్టానని చెప్పుకొచ్చింది, న్యాయం కావాలి మూవీ నా లైఫ్ టర్నింగ్ పాయింట్.
అందులో చిరంజీవి ని కొట్టి కొట్టి మాట్లాడే సీన్ ఉంటుంది, ఆ సన్నివేశం కోసం 23 టేక్స్ తీసుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి ముఖం చూస్తే రెడ్ కలర్ అయిపోయింది, అంత గట్టిగా కొట్టేశాను అని రాధిక చెప్పింది. ఇది ఇలా ఉంటే ఇండస్ట్రీ లో హీరోయిన్ గా ఉంటే ఆ తర్వాత తల్లిపాత్రలు చేయాలనే ఫార్మాట్ ఉంది, అది ఫా లో అవడం నాకు ఇష్టం లేదు. అందుకే బుల్లి తెరపై సీరియల్స్ చేశాను అని రాధిక చెప్పుకొచ్చింది. ఇది ఇలా ఉంటే రాధిక కొన్ని రోజుల క్రితం శర్వానంద్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కీలక పాత్రలో నటించింది, ఇది ఇలా ఉంటే రాధిక ఒకప్పుడు హీరోయిన్ గా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుని , ప్రస్తుతం సినిమాలలో ముఖ్య పాత్రల్లో నటించి కూడా అదే రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది.