ఆచార్య ట్రైలర్ పై మెగా అభిమానుల సందేహాలు !

Seetha Sailaja
నిన్న తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన ధియేటర్లలో విడుదలైన ‘ఆచార్య’ ట్రైలర్ ను చూడటానికి విశేషంగా అభిమానులు ధియేటర్ల వద్దకు రావడంతో ధియేటర్లు అన్నీ మెగా మ్యానియాతో హోరెత్తిపోయాయి. ఈ ట్రైలర్ ధియేటర్లలో విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో ఆ ట్రైలర్ హంగామా మొదలై సోషల్ మీడియాను షేక్ చేసింది.

మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సినిమా కావడంతో ఈమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. ఈఅంచనాలకు తగ్గట్టుగానే ఈ ట్రైలర్ ను మాస్‌ యాక్ష‌న్ ఎమోష‌న్స్ క‌ల‌బోసిన విధంగా కట్ చేయడంతో అందరికీ ఈ ట్రైల‌ర్ బాగా నచ్చింది. అయితే ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది సేపటికే కొన్ని సందేహాలు మెగా అభిమానులకు మొదలయ్యాయి.

ఈమూవీలో మెయిన్ పాత్ర చిరంజీవి అయితే అతిధి పాత్ర చరణ్ అంటూ ఇప్పటివరకు అనుకున్నారు. అయితే దీనికి భిన్నంగా ఈమూవీ కథ చ‌ర‌ణ్ చేసిన సిద్ధ పాత్ర‌తోనే మొదలై అత‌డి పాత్ర తోనే ముగింపు వస్తుందని ఆ ట్రైలర్ చూసిన వారికి అర్థం అవుతుంది. దీనితో ఈ మూవీలో హీరో చిరంజీవి అనుకోవాలా లేదంటే చరణ్ అనుకోవాలా అన్నచర్చలు మెగా అభిమానులలో మొదలయ్యాయి. సిద్ధ లక్ష్యాన్ని ఆచార్య పాత్రను చేస్తున్న చిరంజీవి ద్వారా నెరవేరినట్లు అనిపిస్తున్నా కథ అంతా చరణ్ చుట్టూ తిరుగుతున్నట్లు క్లారిటీ వస్తోందని మెగా అభిమానుల అభిప్రాయం.

దీనికితోడు ఈమూవీ ప్రమోషన్ లో చిరంజీవి కంటే చరణ్ ను బాగా హైలెట్ చేస్తారని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో చరణ్ రామ్ పాత్ర హైలెట్ కావడంతో ఇప్పుడు ‘ఆచార్య’ లోని సిద్ధ పాత్ర కూడ హైలెట్ అయితే ఇక చరణ్ నెంబర్ వన్ స్థానానికి చేరినట్లే అన్న అంచనాలు వస్తున్నాయి. ఈనెల 23న భాగ్యనగరంలో జరిగే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి చరణ్ లతో పాటు పవన్ కూడ వస్తాడు అని వార్తలు వస్తూ ఉండటంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: