వాయిదా పడ్డ రణబీర్ అలియా పెళ్లి!

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ జోడీ ఆలియా భట్ ఇంకా అలాగే రణబీర్ కపూర్ ల వివాహం ఈనెల 14 లేదా 15 వ తేదీన జరగాల్సి ఉంది. పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఇంకా వెళ్లడించలేదు కాని చాలా మంది ఆ రెండు తేదీల్లో ఒక తేదీన పెళ్లి ఉంటుందని..17వ తేదీన తాజ్ మహల్ హోటల్ లో రిసెప్షన్ ఉంటుందని అన్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే పెళ్లి వాయిదా పడ్డట్లుగా సమాచారం తెలుస్తోంది.ఆలియా భట్ ఇంకా రణబీర్ కపూర్ ల వివాహం అంటే దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అయినా కాని అతి తక్కువ మంది గెస్ట్ లను ఆహ్వానిస్తున్నారు. ఆ అతి తక్కువ మందిలో కూడా అత్యంత ప్రముఖ వ్యక్తులు మాత్రమే ఉండబోతున్నారు. అందుకే పెళ్లి వద్ద సెక్యూరిటీ విషయంలో చాలా సీరియస్ గా ఉండాల్సిన అవసరం అనేది ఉంది. అందుకే సెక్యూరిటీ రీజన్స్ వల్ల పెళ్లిని వాయిదా వేసినట్లుగా సమాచారం తెలుస్తోంది.




పెళ్లి ని మరీ ఎక్కువ దూరం వాయిదా వేయకుండా ఒక వారం రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 20వ తేదీన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది.ఇక భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన తర్వాత వాయిదా వేయడం అంటే ఖచ్చితంగా చాలా నష్టం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాని సెక్యూరిటీ కారణాల వల్ల పెళ్లి తంతును వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని బాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అనేది అందుతోంది.తెలుగు లో ఆలియా భట్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఆ సినిమా లో ఆమె పాత్ర చిన్నదే అయినా కూడా కథ లో చాలా కీలకం అని చెప్పాలి. అందుకే సినిమా లో ఆమె పాత్ర చిన్నదే అయినా ఆమె ఓకే చెప్పినట్లుగా సమాచారం తెలుస్తోంది. సినిమా లో తన పాత్ర చిన్నగా ఉందంటూ అలిగింది అంటూ పుకార్లు కూడా అప్పుడు వచ్చాయి. కాని అవి ఏవి కూడా నిజం కాదని ఆలియా భట్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: