సాధారణంగా కండోమ్ ప్రకటనలో నటించాలంటే అందుకు ప్రత్యేకమైన క్వాలిటీస్ అనేవి కావాలి. సన్నీలియోన్- షెర్లిన్ చోప్రా సహా పలువురు కథానాయికలు గతంలో కండోమ్ ప్రకటనల్లో నటించి కనిపించారు.ఇక ఆ భామల ప్రచారం యూత్ లో అగ్గి రాజేసింది. అయితే ఇప్పుడు బబ్లీ బ్యూటీ నిధి అగర్వాల్ ట్రెడిషన్ ని విడిచిపెట్టి ఒక ఫేమస్ బ్రాండ్ ఇంటెన్స్ కండోమ్ కి ప్రచారం చేయడం నెటిజనుల్లో ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిచ్చింది.అందుకు ట్రోలర్స్ అయితే ఇప్పుడు నిధిపై ఒక రేంజులో విరుచుకుపడ్డారు. సరసంగా ఘాటైన కామెంట్లు చేస్తూ వారు బాగా రెచ్చిపోయారు.ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ పెద్ద ఆఫర్ అందుకున్న సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా సినిమా అయిన `హరి హర వీర మల్లు` సినిమాలో నటిస్తోంది. తనకు ఇప్పటికే ఇన్ స్టాగ్రామ్ లో 21 మిలియన్ల(2.1 కోట్లు)కు పైగా ఫాలోవర్స్ ఉండటంతో అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు సినిమా నాయికగా ఆమె పేరు తెచ్చుకుంది.తనకు ఉన్న ఫాలోయింగ్ వల్ల సోషల్ మీడియాలో ప్రచారం కోసం కార్పొరెట్ బ్రాండ్లు నిధి వైపు క్యూ కడుతున్నాయి. పెయిడ్ ప్రమోషన్ల కోసం నిధి అగర్వాల్ తన ఇన్ స్టాగ్రామ్ ను ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బుని సంపాదిస్తోంది.
ఇన్ స్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి నిధి అగర్వాల్ లక్షల రూపాయలను నిధి అగర్వాల్ సంపాదిస్తోంది. అయితే తన ఫాలోవర్స్ చాలా మంది కామెంట్స్ సెక్షన్ లో నిధిని పలు చిలిపి ప్రశ్నలు అడిగారు. వీటిలో చాలా కామెంట్స్ ఎంతో అసభ్యకరంగా ఉన్నాయి.ఇక ఈ వీడియోలో.. మహిళల క్లైమాక్స్ ను పాపులర్ ఇంటెన్స్ కండోమ్ చాలా మెరుగ్గా మారుస్తుందని.. కాబట్టి ఈ బ్రాండ్ ఇంటెన్స్ కండోమ్ లను వాడమని ప్రజలను కోరింది నిధి. దీంతో నిధి అగర్వాల్ పై ట్రోలర్స్ ఒక రేంజులో విరుచుకుపడ్డారు. తీవ్రమైన న్యూడ్ భాషతో తనని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల నటీమణులు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో ఆల్కహాల్ బ్రాండ్ లను ప్రచారం చేసినందుకు భారీ ట్రోలింగ్ ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.చాలా మంది నటీనటులు ఈమధ్య మద్యం బ్రాండ్ల కోసం పెయిడ్ ప్రమోషన్లు కూడా చేశారు. ఇక ఈ ట్రెండ్ ను మరింత ముందుకు తీసుకువెళ్లి.. హీరోయిన్ నిధి అగర్వాల్ కండోమ్ బ్రాండ్ ను ప్రమోట్ చేసింది. బబ్లీ లుక్ తో స్పైసీ టాకింగ్ తో కండోమ్ ప్రమోషన్ వీడియోను షేర్ చేయగా అది నెట్టింటా వైరల్ గా దూసుకెళ్లింది.