"బాలీవుడ్ లో ఎన్టీఆర్ మల్టీస్టారర్"... దర్శకుడు ఎవరో తెలుసా?

VAMSI
కథ ఏదైనా తన డైరెక్షన్ తో సినిమాకి ప్రాణం పోయగల సత్తా గల దర్శకుడు ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న నుండి జాలు వారిన మరో అద్భుతం "రణం రౌద్రం రుధిరం". ఈ సినిమా అంచనాలకు మించి రిజల్ట్ ను అందించింది. టాలీవుడ్ అగ్ర కథానాయకులు రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ ఇరువురు కలిసి నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఈ చిత్రానికి ప్రపంచ నలుమూలల నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. వీరి ఇరువురు కూడా పోటాపోటీగా నటించి ఆడియన్స్ కు 100% సంతృప్తిని అందించారు. "కొమరం భీముడో..." అంటూ తారక్ పాడుతూ ఇచ్చే ఎక్స్ప్రెషన్ కు, పోలీస్ అధికారిగా చెర్రీ నటనకు అంతా ఫిదా అవుతున్నారు.

అయితే ఈ సినిమాలో కొన్ని ప్రధాన సన్నివేశాలలో ఎన్టీఆర్ నటన చూసిన బాలీవుడ్ దర్శకుడు ఒకరు ఒక భారీ మల్టీ స్టారర్ కోసం ఎన్టీఆర్ ను సంప్రదించారట. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో చేయడానికి సదరు దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఇంత వరకు ఈ విషయం గురించి ఎన్టీఆర్ తో చర్చించడం కానీ, మిగిలిన విషయాలు కానీ ఇంకా బయటకు రాలేదు. అయితే ఆ దర్శకుడు ఎవరు ? ఎన్టీఆర్ తో నటించబోయే మరో స్టార్ హీరో ఎవరు అన్న విషయాలు ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉన్నాయి.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలు ఏవీ చిత్రీకరణ దశలో లేవు. అన్ని ప్రాజెక్ట్ లు చర్చల దశలోనే ఉన్నాయి. అయితే అన్నీ కుదిరితే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మరియు ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలు జరగాల్సి ఉన్నాయి. మరి చూద్దాం ఏ సినిమా ముందుగా సెట్స్ పైకి వెళ్లనుందో చూడాలి. ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ మరియు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: