టాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే నాని తన ప్రతి సినిమాకి విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకులుని అలరిస్తాడు. ఇకపోతే నేచురల్ స్టార్ నాని హీరోగా టాలెంటెడ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా "దసరా" చిత్రం రూపొందుతోంది.అయితే ప్రముఖ నిర్మాత సుధాకర్ చెరుకూరి తన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై 'దసరా'ను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం..
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న నాని తొలి పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. ఇక అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చిత్రీకరణ జరుగుతున్నది. అయితే నాయకానాయికలు నాని, కీర్తి సురేష్‌లపై భారీ స్థాయిలో పాటను చిత్రీకరిస్తున్నారు. ఇకపోతే ప్రేమ్క్ష్రిత్ కొరియోగ్రఫీ అందిస్తున్న ఈ పాటను దాదాపు 500 మంది డ్యాన్సర్స్‌తో తెరకెక్కిస్తున్నారు.ఇదిలావుంటే ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల దగ్గర ఉన్న ఓ గ్రామం నేపథ్యంలో జరిగే కథ ఇది. అయితే హీరో నాని పక్కా మాస్ పాత్రలో కనిపిస్తారు.
ఇదిలావుండగా ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు మంచి స్పందన లభిస్తున్నది.అయితే తెలంగాణ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుంది అని చిత్రబృందం పేర్కొంది.కాగా నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి టాప్ డీవోపీ సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ గా విజయ్ చాగంటి వ్యవహరిస్తున్నారు.ఇక మరోవైపు నాని తాజాగా నటిస్తున్న 'అంటే సుందరానికి' సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది....!!