'బిగ్ బాస్ ఓటిటి' ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందా..?

Pulgam Srinivas
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు,  ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ ఉండటంతో ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో విజయవంతంగా అయిదు  సీజన్ లను  పూర్తి చేసుకుంది.  బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు మొదటి సీజన్ కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు,  నాని రెండవ సీజన్ కు హోస్ట్ గా  వ్యవహరించాడు. మూడవ, నాలుగవ, ఐదవ సీజన్ లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి'  నాన్ స్టాప్ ప్రసారం అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే, బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి' కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు,  తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి'  స్టార్ట్  అయ్యి ఇప్పటికి ఆరు వారాలు పూర్తి కావస్తోంది.  ఇప్పటి వరకు బిగ్ బాస్ తెలుగు 'ఓ టి టి'  నాన్ స్టాప్ నుండి ముమైత్‌ ఖాన్‌, శ్రీరాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వి వరుసగా ఎలిమినేట్‌ అయ్యారు,  మొదటి వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ మళ్ళీ తిరిగి రీఎంట్రీ ఇచ్చింది.


 ఈ వారం తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి'  లో మిత్ర శర్మ, నటరాజ్, మహేశ్‌ విట్టా, అషూ రెడ్డి, హమీదా, బిందు మాధవి, యాంకర్ శివ, అజయ్, స్రవంతి, ముమైత్ ఖాన్ నామినేషన్‌లో ఉన్నారు,  నామినేషన్ లో ఉన్న పది మందిలో ముమైత్‌ ఖాన్‌, స్రవంతి, మిత్ర శర్మకు తక్కువ ఓట్లు నమోదయ్యాయని, ఈ ముగ్గురే ప్రస్తుతం  డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ఈ వారం బిగ్ బాస్  'ఓ టి టి' లో డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది,  ఒ కవేళ డబల్ ఎలిమినేషన్ ఉన్నట్లయితే బిగ్ బాస్ హౌస్ నుండి ముమైత్ ఖాన్,  స్రవంతి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది,  మరి డబల్ ఎలిమినేషన్ ఉంటుందా..?  ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు..? అనేది ఈ రోజు నాగార్జున అధికారికంగా ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: