దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే, బాహుబలి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా అదిరిపోయే కలెక్షన్లను సాధించి బాక్సాఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త కొత్త రికార్డులను కూడా నమోదు చేసింది. బాహుబలి సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించగా అనుష్క హీరోయిన్ గా నటించింది, బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ కు అనుష్క కు పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వచ్చింది. ఇది ఇలా ఉంటే తాజాగా బాహుబలి సినిమాపై క్రియేటివ్ దర్శకుడు మణిరత్నం ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు, దర్శకుడు మణిరత్నం గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మణిరత్నం తన కెరియర్ లో ఎన్నో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు, అలా తనకంటూ దర్శకుడిగా ఒక సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మణిరత్నం ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది, పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగంను సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిస్తున్నారు, తాజాగా మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' సినిమా గురించి మాట్లాడుతూ... పొన్నియిన్ సెల్వన్ సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి నాకు ఇన్సిపిరేషన్ అని మణిరత్నం చెప్పుకొచ్చాడు, పొన్నియిన్ సెల్వన్ మూవీ లో ప్రధాన పాత్రల్లో తమిళ నటుడు విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష కనిపించనున్నారు, పొన్నియిన్ సెల్వన్ మూవీ ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది.