
సూర్య ఓ మై డాగ్ మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఓటీటీ వేదికగా..?
ఇటీవల వచ్చిన జై భీమ్ సినిమా ఏ రేంజ్ లో విజయం సొంతం చేసుకుందో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు ఈ సినిమా ఏకంగా ఆస్కార్ కు నామినేట్ అయింది ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుంటుంది అనే నేపద్యంలో చివరి లో ఈ సినిమా ఆస్కార్ ను మిస్ చేసుకోవడం కొంతవరకు విషాదకరమే అని చెప్పవచ్చు. ఇకపోతే ఈయన భార్య జ్యోతిక కూడా అందరికీ సుపరిచితురాలే ఎన్నో సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే వివాహం తర్వాత ఆమె తన భర్త సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా బాధ్యతలు చేపట్టింది జ్యోతిక.
అయితే తాజాగా సూర్య తన భార్య జ్యోతిక తో కలిసి నిర్మిస్తున్న ఓ మై గాడ్ సినిమా త్వరలోనే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే డైరెక్టుగా థియేటర్లలో కాకుండా ఈసారి ఓటీటీ లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓ మై డాగ్ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన అమెజాన్ ప్రైమ్ ఓ టీ టీ వేదికగా విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎలా ఉంటుందో ఏ కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తారో సూర్య అని తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు.