దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్ ఆర్ సినిమాలో అందాల భామ ఆలియా భట్ నటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా ఆమె అల్లు అర్జున్ ..పుష్ప చిత్రం పై ఓ కామెంట్ చేసింది. ఇక అది ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఏమంది?అయితే తాజాగా అలియా ..ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గంగూబాయ్ కతియావాడి సక్సెస్ గురించి మాట్లాడారు. అయితే అసలు ముందు ఆ క్యారెక్టర్‌ను ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అయ్యేలా చేయాలో ఆలియాకు అవగాహన లేదట. ఇకపోతే డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ బావున్నా కూడా..
నటిగా బాడీ లాంగ్వేజ్‌లో ఓ కొత్తదనాన్ని చూపిస్తే కానీ విజయం సాధించలేమని ఆలియా భట్ భావించింది. ఇక ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప ది రైజ్ సినిమా విడుదలైంది.అంతేకాదు పుష్ప ది రైజ్ సినిమా క్యారెక్టర్ డ్రివెన్ మూవీ. ఇకపోతే బన్నీ బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. అయితే దాన్ని చూసిన తర్వాత ఆలియా భట్ తన క్యారెక్టర్ కూడా మాస్‌గా ఉండాలని డిఫరెంట్‌గా ట్రై చేసిందట. కాగా ఆలియా చేసిన ఆ మార్పుతో ఆమె నటనలో కొత్త కోణం కనిపించింది.ఇక అలా ఆలియా భట్ తన సక్సెస్ సీక్రెట్‌ను రివీల్ చేసింది.
అయితే పుష్ప సినిమానే తన హిట్ మూవీకి కారణమంటూ చెప్పింది ఆలియా భట్. ఇకపోతే క్యారెక్టర్ డ్రివెన్ బేస్డ్ మూవీలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది ఆలియా భట్. అయితే ఈ ఏడాది ఆలియాకు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక ఎందుకంటే బాలీవుడ్‌లో గంగూ బాయ్ కతియావాడితో హిట్ అందుకుంది. అంతేకాదు అలాగే పాన్ ఇండియా మూవీ RRRతోనూ బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. తాజగా ఇప్పుడు ఈ కామెంట్ తర్వాత ఆమెకు అల్లు అర్జున్ సినిమాలో ఆఫర్ రాబోతోందంటూ రూమర్స్ మొదలయ్యాయి...!!