నిహారిక వ్యవహారంతో వరుణ్ తేజ్ కి కొత్త సమస్యలు..?

Anilkumar
మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.తాజాగా  నిహారిక ఇటీవల జరిగిన పబ్ రైడ్ లో పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు నిహారిక పేరు ప్రముఖంగా మీడియాలో రావడంతో మెగా కుటుంబ సభ్యులు అందరూ షాక్ లో ఉన్నారు.ఇకపోతే ఫుడింగ్ మింక్ పబ్‌ వ్యవహారంపై స్పందించిన నాగబాబు…ఇక  నిహారిక తప్పులేదని పోలీసులు చెప్పారని, ఊహాగానాలు ప్రచారం చేయొద్దని నాగబాబు కోరారు. అయితే ''పబ్‌లో నిహారిక ఉండడం వల్లే నేను స్పందిస్తున్నాను. కాగా నిర్ణీత సమయానికి మించి పబ్‌ నడుపుతున్నారనే..

పోలీసులు చర్యలు తీసుకున్నారు.ఇకపోతే నా కూతురు నిహారిక విషయంలో అంతా క్లియర్‌.అంతేకాదు  నిహారిక తప్పు లేదని పోలీసులు చెప్పారు. ఇక ఊహాగానాలకు తావివ్వకూడదనే దీనిపై స్పందిస్తున్నాను.అయితే  ఈ వ్యవహారంలో తప్పుడు ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను'' అని నాగబాబు ఓ వీడియో సందేశాన్ని మీడియాకు విడుదల చేశారు.అయితే నాగబాబు వీడియో తర్వాత అంతా సద్దుమణుగుతుంది అని అనుకున్నా ఇంకా ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. ఇక నిహారిక వలన మెగా ఫ్యామిలీ సభ్యులు అంతా చాలా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది.అంతేకాకుండా ముఖ్యంగా ముఖ్యంగా హీరో వరుణ్ తేజ్ చాలా ఇబ్బంది పడుతున్నాడట.

అయితే చెల్లెలు నిహారిక అంటే వరుణ్ కి ప్రాణం. ఇక అదీ కాకుండా, ఇప్పుడు తన సినిమా 'గని' విడుదలకు సిద్ధంగా ఉండడంతో సమస్య వచ్చింది.ఇకపోతే ఈ సినిమా ఇంటర్వ్యూలలో మీడియా ఆ పబ్ రైడ్ గురించి అడగకుండా చూసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అయితే అది ఇప్పుడు ఆయన ముందున్న సమస్య. ఇక ఈ సినిమాకి బాగా హైప్ తీసుకురావాలని వరుణ్ ప్రయత్నిస్తున్న వేళ ఈ పబ్ రైడ్ జరిగింది.ఇకపోతే  నిహారిక డ్రగ్స్ తీసుకోలేదు, ఆమె విషయం వరకు క్లియర్ అని ఇప్పటికే నాగబాబు వివరణ ఇచ్చారు. కాగా  మీడియా ప్రశ్నలు ఇబ్బంది పెడుతాయి.ఇక  అందుకే ఈ విషయంలో వరుణ్ జాగ్రత్తగా డీల్ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. ఇకపోతే 'గని' కోసం రెండేళ్లు కష్టపడ్డాడు వరుణ్. ఇక అనేకసార్లు సినిమా వాయిదా పడింది. అయితే బజ్ తెద్దామనుకునే టైంకి ఈ సమస్య వచ్చింది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: