ఉప్పెన సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దర్శకుడు బుచ్చిబాబు ఇప్పుడు తన తదుపరి సినిమా ఎన్టీఆర్ తో చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. సుకుమార్ శిష్యుడిగా తొలి సినిమానే పెద్ద బ్యానర్లో చేసిన ఈ దర్శకుడు బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా పెద్ద హీరోల దృష్టిలో కూడా పడ్డాడు. ఆ విధంగా ఈ దర్శకుడికి డిమాండ్ కూడా బాగా పెరిగిపోయింది. పెద్ద హీరోల దగ్గర నుంచి ఆఫర్లు వస్తున్నాయి.
మంచి నిర్మాతల దగ్గర నుంచి ఆఫర్ లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తన తదుపరి సినిమా కూడా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ తో చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో స్టార్ నిర్మాతల నుంచి వచ్చిన ఆఫర్లను సున్నితంగా తిరస్కరించి తన నెక్స్ట్ సినిమా మైత్రి తో చేసే విధంగా ముందుకు వెళుతున్నాడు. అలా ఓ స్పోర్ట్స్ కాన్సెప్ట్ ను ఎన్టీఆర్ కోసం రెడీ చేసిన ఆయనకు సమయం అనుకూలంగా మారడం లేదు. ఎన్టీఆర్ కోసమే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ దర్శకుడు కి తాజాగా కొన్ని చిక్కులు వచ్చి పడేలా కనిపిస్తుంది.
దాదాపు మూడున్నర సంవత్సరాలు చూసిన తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల చేశాడు ఎన్టీఆర్. ఈ సినిమా ఎట్టకేలకు విడుదల కావడంతో ఆయన ఫ్రీ అయిపోయారు. ఆ తర్వాత చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి రెడీ కాగా ఈ సినిమా త్వరలోనే తెరకెక్కబోతుంది. జూన్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల కావడానికి ఎంతలేదన్నా సంవత్సరకాలం పడుతుంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ సినిమా తరువాత కానీ ఈ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయలేడు. దీనితో ఈలోపు ఈ దర్శకుడు మరో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా తర్వాత ఈ దర్శకుడితో చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉండడం తో బుచ్చిబాబు కూడా ఓ సినిమాను పూర్తి చేస్తే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నాడు.