
బీస్ట్ తెలుగు సినిమా ట్రైలర్ రిలీజ్.. ఎప్పుడంటే..?
ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే ఈ సినిమా ట్రైలర్ తెలుగులో ఏప్రిల్ 5వ తేదీన దిల్ రాజ్ చేతులమీదుగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు తమిళంలో విడుదలైన బీస్ట్ ట్రైలర్ చూస్తే ఈ సినిమా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో నిండి ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో హీరో విజయ్ వీర రాఘవన్ స్పై అనే ఒక ఏజెంట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్లు అనిరుద్ సంగీతం ఒక లెవల్ లో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రం థియేటర్లో ఎలా ఆకట్టుకుంటుందో అనే విషయం మరో కొద్ది రోజుల్లో తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా ట్రైలర్ 25 మిలియన్ల వ్యూస్ ను అందుకున్నది.
ఈ చిత్ర తెలుగు రైట్స్ ను దిల్ రాజ్ దక్కించుకున్నాడు దీంతో ఈ సినిమా ట్రైలర్ ను కూడా ఆయన చేతుల మీదగా నే విడుదల చేయాలని చిత్ర మేకర్ భావించి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. అయితే ఈ ట్రైలర్ ను చూసిన కొంతమంది మాత్రం.. మనీ హిస్ట్ అనే వెబ్ సిరీస్ మాదిరి ఉన్నదున్నట్లుగా తెలియజేస్తున్నారు. తెలుగు లోనే ఈ సినిమా రైట్స్ 11 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు గా టాక్ వినిపిస్తుంది. మరి అంతటి కలెక్షన్లను రాబడుతోంది ఏమో చూడాలి.