ఎన్టీఆర్ ప్రాణ మిత్రుడే.. ఆయనకు వ్యతిరేకంగా సినిమా తీశాడట తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా కనిపించే రాముడిగా, కృష్ణుడిగా పౌరాణిక పాత్రలలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా ఎన్నో సినిమాలు తెరకేక్కించి తన ప్రతిభను చాటుకున్నారు. అంతే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తిగా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు అయితే నందమూరి తారకరామారావు ప్రతి ఒక్కరు కూడా అమితంగా గౌరవించేవారు.


 సినిమా పట్ల ఆయన చూపించే నిబద్ధత ఇక సినిమాల ఊపిరిగా బ్రతికిన ఆయనను చూసి స్పూర్తి పొందేవారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ కూ కొంతమందితో విభేదాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి   అలాంటి వారిలో ప్రభాకర్రెడ్డి కూడా ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ ద్వారానే ప్రభాకర్ రెడ్డి చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు. వీరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఏర్పడింది. కానీ అన్న గారు టిడిపి పార్టీ స్థాపించిన తర్వాత మాత్రం వీరు స్నేహబందంలో చీలికలు వచ్చాయి  ఎందుకంటే ప్రభాకర్రెడ్డి, దాసరి, నట శేఖర కృష్ణ ఒక వర్గంగా ఉండడమే కాదు కాంగ్రెస్ ని అమితంగా అభిమానించేవారు.



 అన్నగారు టిడిపి పార్టీ పెట్టినప్పుడు ఆయనకు మద్దతు తెలిపలేదు. అన్నగారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన తీసుకొచ్చిన విధానాలను ఈ ముగ్గురు వ్యతిరేకించేవారు. ఈ క్రమంలోనే ఏకంగా అన్న గారికి వ్యతిరేకంగా అతనికి ఆప్త మిత్రుడు అయినా భాస్కర్ రెడ్డి ఏకంగా ఒక సినిమాను కూడా తెరకెక్కించారు.  మండలాధీశుడు అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ సినిమా మంచి విజయాన్ని కూడా సాధించింది. అదే సమయంలో ఇక దాసరి ఎన్టీఆర్ కు పోటీ ఎన్టీఆర్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు ఉదయం అనే పత్రికను కూడా ప్రారంభించారు. ఇలా ఏకంగా ఎన్టీఆర్ ఆప్తమిత్రుడు ఆయనకు వ్యతిరేకంగా సినిమా చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: