భారతదేశం మొత్తం ఎంతగానో ఎదురు చూసిన సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుని వెయ్యి కోట్ల వసూళ్లను అందుకోవడానికి ముందుకు దూసుకుపోతుంది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాను రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించగా పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. మార్చి 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించడం మాత్రమే కాకుండా రికార్డుల మోత మోగించడం కూడా జరుగుతుంది.
ఇప్పటికే బాహుబలి రికార్డులను క్రాస్ చేసిన ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆరు వందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన ఈ సినిమా రానున్న రోజుల్లో మరింత వసూళ్లను సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ సినిమా విడుదల సమయంలో చిత్ర బృందం చేసిన ప్రమోషన్ కార్యక్రమాలు అంతా ఇంతా కాదు. అందుకే ఇప్పుడు ఈ స్థాయిలో వసూలు వస్తున్నాయి. అలా ఇప్పుడు భారతదేశాన్ని ఎంతగానో అలరించే సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. అదే కే జి ఎఫ్ చాప్టర్2.
యశ్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ 14 వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టడానికి చిత్రబృందం రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒక వారం పది రోజులలో ఆర్ఆర్అర్ మేనియా ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ ప్రారంభించడం లేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేసి ప్రేక్షకులలో ఎక్కడలేని ఉత్సాహం కలిగించారు. ట్రైలర్ విడుదల చేయడంతో ఈ సినిమా యొక్క రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మరి ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ రికార్డు లను దాటేసెలా ఉంటుందా అనేది చూడాలి.