డ్రగ్స్ కేసులో చిక్కుకున్న మెగా డాటర్..!!

Divya
కొంతకాలంగా హైదరాబాదులో డ్రగ్స్ వాడకం భారీగా పెరిగి పోతున్న విషయం అందరికి తెలిసిందే. అంతే కాదు అందుకు తగ్గట్టుగానే ఇటీవల ఒక వ్యక్తి ప్రాణాలను కూడా కోల్పోవడం భయాందోళనకు గురి చేసింది. ఏమాత్రం లెక్కచేయకుండా డ్రగ్స్ తీసుకోవడం మాత్రం యువత ఆపి వేయడం లేదు. దీంతో నగర పోలీసులు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నియమ నిబంధనలు పాటించని పబ్ లపై టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో మరో భారీ రేవ్ పార్టీని తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. బంజారాహిల్స్లో ఉన్న రాడిసన్ బ్లూ పబ్బులో ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేయగా యజమాని తో సహా 150 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


ఇక ఇప్పటికే రేవ్ పార్టీలో పట్టుబడిన సెలబ్రిటీలు వారి పిల్లల పేర్లు కూడా బయటకు రావడం గమనార్హం. బిగ్ బాస్ విన్నర్ అలాగే టాలీవుడ్ ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉండడంతో ఈ వ్యవహారం కాస్త బాగా హాట్ టాపిక్ గా మారింది. పబ్ లో నిర్వహించిన పార్టీలో వీరంతా డ్రగ్స్ వాడినట్లుగా పోలీసులు వెల్లడించారు. ఈ పార్టీలో అనేక మంది యువతులు కూడా పాల్గొనడం జరిగింది ఇకపోతే నిహారిక కూడా ఈ పార్టీలో పాల్గొన్నట్లు ఆమెను పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నట్లు చర్చనీయాంశంగా మారడం తో ఈ విషయం సోషల్ మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.


ఈ పార్టీలో యువ హీరో తో పాటు పెద్ద పెద్ద సెలబ్రిటీల పిల్లలు కూడా ఉన్నారు అని సమాచారం. పుడింగ్ మిగ్ పబ్ లో తెల్లవారే వరకు నిర్వహిస్తూ యాజమాన్యం నానా హంగామా ఇస్తున్నట్టు తెలియడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఈ రేవ్ పార్టీ దాడుల్లో ఉప్పల్ అనిల్ కుమార్ తో పాటు సిరీస్ రాజు కుమారుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాడిసన్ బ్లూ హోటల్  ని అధికారులు సీజ్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: