'ఘోస్ట్' మూవీ నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ ప్లాన్ చేశారంటే..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు మూవీ తో మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు,  బంగార్రాజు మూవీ  సోగ్గాడే చిన్నినాయన సినిమా కు సీక్వెల్ గా తెరకెక్కింది.  సోగ్గాడే చిన్ని నాయన మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన మూవీ కి సీక్వెల్  గా తెరకెక్కుతున్న బంగార్రాజు మూవీ తో కూడా మంచి విజయాన్ని అందుకున్నాడు,  బంగార్రాజు విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న నాగార్జున ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి' కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.  నాగార్జున తెలుగు బిగ్ బాస్ 'ఓ టి టి' కి హోస్ట్ గా వ్యవహరించడం తో  పాటు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ మూవీ లో హీరో గా కూడా నటిస్తున్నాడు, ది ఘోస్ట్ మూవీ బంగార్రాజు మూవీ కంటే ముందే ప్రారంభం అయినప్పటికీ ది ఘోస్ట్ సినిమా ఇప్పటికీ కూడా షూటింగ్ ను జరుపుకుంటోంది.  


 ది ఘోస్ట్ మూవీ ని శ్రీవెంకటేశ్వర సినిమాస్, ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు,  ఈ సినిమా లో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ కథానాయికగా నటిస్తుంది.  ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ది ఘోస్ట్ మూవీ ఇటీవల దుబాయ్‌ షెడ్యూల్‌ ని పూర్తి చేసుకుంది,  ఈ షెడ్యూల్‌ లో లో చిత్ర బృందం లీడ్‌ పెయిర్‌ తో కూడిన మేజర్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, రొమాంటిక్‌ సాంగ్‌ ని చిత్రీకరించినట్లు సమాచారం,  ఇది ఇలా ఉంటే తాజా గా ది ఘోస్ట్ చిత్ర బృందం ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ నెక్స్ట్  షెడ్యూల్ షూటింగ్‌ ని ఊటి లో జరుపుతున్నట్టు ప్రకటించింది.  ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: