గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయనున్న ఆచార్య టీం..ఎప్పుడంటే..?

Divya
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య.. ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం అందరికీ తెలిసినదే. మొదటిసారిగా తండ్రీ కొడుకులు కలిసి స్క్రీన్ని షేర్ చేసుకోవడం దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇక అంతే కాకుండా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం గమనార్హం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్, టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఇక ఇప్పటి వరకు విడుదలైన పాటలు కూడా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి.

ఇక ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్లో ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి రెగ్యులర్ గా అప్ డేట్ లేకపోవడంతో మెగా అభిమానులు కాస్త నిరాశ చెందారు అని చెప్పవచ్చు. అయితే నిన్నటి రోజున ఉగాది పండుగ సందర్భంగా అప్డేట్ వస్తుందేమో అని ఏదైనా ఆశించారు. ఇక ఈ నేపథ్యంలోనే ఆచార్య చిత్ర బృందం నుంచి మేకర్ ట్రైలర్ కు సంబంధించి ఒక అప్డేట్ ను విడుదల చేశారు. ఇక  ఏప్రిల్ 6వ తేదీ నుండి కిక్ స్టార్ ప్రమోషన్స్ తో పాటుగా ఏప్రిల్ 17న భారీ ఫ్రీ- రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం.

అయితే నిన్నటి రోజున ఒక చిన్న వీడియో ద్వారా ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్మెంట్ తెలియజేసింది. ఇక ఆచార్య చిత్రంలో చిరంజీవి పక్కన కాజల్, చరణ్ పక్కన పూజాహెగ్డే నటించనుంది. ప్రత్యేకమైన సాంగులో రెజీనా నటిస్తూ ఉండగా. సోను సూద్, పోసాని, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి తదితరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కొనిదెల బ్యానర్ పై నిర్మించారు. ఇక కొరటాల శివ కూడా తనదైన శైలిలో సందేశాత్మక చిత్రాలను తెరకెక్కిస్తారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: