మాస్ మహారాజా రవితేజ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, రవితేజ తన కెరియర్ లో ఎన్నో సార్లు ఒక సినిమాలో ఇద్దరు హీరోయిన్ లతో ఆడిపాడారు. అలా రవితేజ ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్ లతో నటించిన సినిమాలలో కొన్ని మూవీ లు మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోగా, మరి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి, ఇది ఇలా ఉంటే రవితేజ కొన్ని రోజుల క్రితం విడుదలైన ఖిలాడి సినిమా లో కూడా డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి ఇద్దరు హీరోయిన్ లతో ఆడి పాడాడు. రమేష్ వర్మ దర్శకత్వం లో తెరకెక్కిన ఖిలాడి సినిమా ఎన్నో అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మరో సారి మాస్ మహారాజ రవితేజ ఒకే సినిమాలో ఇద్దరు హీరోయిన్ లతో ఆడిపాడనున్నాడు.
రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' అనే సినిమాలో నటించబోతున్నా విషయం మన అందరికీ తెలిసిందే, ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈ రోజు నిర్వహించనున్నారు, అందుకు సంబంధించిన సన్నాహాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ మూవీ కి వంశీకృష్ణ దర్శకత్వం వహించనున్నాడు, టైగర్ నాగేశ్వరరావు మూవీ లో ఇద్దరు హీరోయిన్ లు నటించనున్నారు. ఒక హీరోయిన్ గా చిత్ర బృందం ఇప్పటికే నుపుర్ సనన్ ను ఎంపిక చేసింది, రెండవ హీరోయిన్ గా గాయత్రి భరద్వాజ్ ను కూడా తీసుకున్నట్టుగా ప్రకటిస్తూ ఆమె ఫొటో ను తాజా గా చిత్ర బృందం బయటకు వదిలింది. ఇలా రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఇద్దరు హీరోయిన్ లతో ఆడిపాడుతున్నాడు.