మారుతి ఇదంతా అవసరమా..!!

P.Nishanth Kumar
రెండు పడవల మీద ప్రయాణం అంతా సవ్యం కాదు అని చాలామంది పెద్దలు చెప్పే మాట. ఒక పని చేస్తున్నప్పుడు అదే సమయంలో మరొక పని చేయడం నిజంగా ఎంతో ఇబ్బందికరమైన విషయమే. సినిమా పరిశ్రమలో అయితే ఒక సినిమా చేస్తున్నప్పుడు మరొక సినిమా మీద దృష్టి పెట్టకూడదు అనే సూత్రాన్ని అందరు దర్శకులు కూడా పాటిస్తారు కానీ మారుతి ఇప్పుడు దాన్ని క్రాస్ చేస్తూ ఇప్పుడు ఒకేసారి రెండు సినిమాల పైన వర్క్ చేస్తున్నాడు. దీనిని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.

గోపీచంద్ తో కలిసి పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న మారుతి దాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. చివరిదశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తుండగా మారుతీ స్టైల్ లో ఈ సినిమా మంచి కమర్షియల్ సబ్జెక్టుతో ఉండబోతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించగా ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు పెంచాయి. అయితే చిన్న సినిమాలతో తన కెరీర్ ని మొదలు పెట్టిన మారుతి ఇప్పుడు ఈ స్థాయిలో ప్రేక్షకులను అలరించే సినిమాలు చేయడం విశేషం.

ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే ఆయన ప్రభాస్ తో ఓ సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నారని వార్తలు వినిపించాయి. దాదాపుగా ఇదే నిజమని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటంటే మారుతి పక్కా కమర్షియల్ సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటునే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులలో కూడా పాల్గొంటున్నారు. ఇది తెలిసి చాలా మంది ఈ విధంగా చేయడం వల్ల రెండు సినిమాలకు నష్టం జరుగుతుందని ఒకటి పూర్తిచేసిన తరువాతనే ఈ చిత్రానికి వస్తే మంచిదని వారు చెబుతున్నారు. మరి మారుతి ఇప్పటికైనా తన పంథాను మార్చుకుని ఆ చిత్రాన్ని పూర్తి చేసి ప్రభాస్ సినిమా పనులలో నిమగ్నమవుతాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: