ప్రభాస్ మూవీ టీజర్ వచ్చేది ఇప్పుడే..?

Pulgam Srinivas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలలో అంతకుమించిన సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే , అందులో భాగంగా ప్రభాస్ తాజాగా  పాన్ ఇండియా  సినిమా రాధే శ్యామ్ మూవీ ని  ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.  ఎన్నో భారీ అంచనాల నడుమ మార్చి  11 వ తేదీన థియేటర్ లాల్క్  విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది,  పూజా హెగ్డే హీరోయిన్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రాధే శ్యామ్ సినిమా ప్రభాస్ కు బాక్స్ ఆఫీస్  దగ్గర విజయాన్ని  తీసుకురాలేకపోయింది. 


 ఇది ఇలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్  సినిమాలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే,  ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది,  ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 10 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమాలో కూడా నటిస్తున్నాడు,  ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా రేంజ్ లో  తెరకెక్కిస్తున్నాడు,  ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.  ఈ సినిమాతో పాటు ప్రభాస్ , నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టు కే మూవీ లో కూడా నటిస్తున్నాడు,  ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు.  ఈ మూవీ లతో పాటు ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పీరిట్ అనే మూవీ లో కూడా నటించబోతున్నాడు,  ఇప్పటికే ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది,  ఈ సినిమాలతో పాటు ప్రభాస్ , మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమాలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: