టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు, ఈ హీరో కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ వెంకీ కుడుముల దర్శకత్వంలో రేష్మీక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ఛలో సినిమాతో నాగశౌర్య బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగ శౌర్య ఆ తర్వాత కూడా అనేక సినిమాలలో హీరోగా నటించాడు, కాకపోతే ఆ సినిమాలు ఏవి నాగ శౌర్య బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా విజయాలను తెచ్చి పెట్టలేదు. ఇది ఇలా ఉంటే నాగ శౌర్య ఈ మధ్యనే వరుడు కావలెను , లక్ష్య అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు, కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
ఇలా వరుస పరాజయాలతో డీలా పడిపోయిన నాగ శౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి అనే సినిమాలో హీరోగా నటించాడు, ఈ సినిమాలో నాగ శౌర్య కు జోడీగా షెర్లి సెటియా నటించింది. ఈ మూవీ కి అనిష్ ఆర్.కృష్ణ దర్శకత్వం వహించగా.. ఐరా క్రియేషన్ పతాకంపై శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో నిర్మాత ఉష మూల్పూరి నిర్మించారు, ఈ మూవీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఏప్రిల్ 22 న వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ రిలీజ్ కార్యక్రమం మార్చి 28 న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది, ఈ కార్యక్రమానికి దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ మూవీ టీజర్ ను లాంచ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా నాగ శౌర్య మాట్లాడుతూ... మూవీ చాలా బాగా వచ్చింది, ఒకప్పుడు ఇండస్ట్రీ లో రీ షూట్ తీస్తే మూవీ పోయింది అనేవాళ్ళు , ఇప్పుడు రీ షూట్ తీయకపోతే మూవీ పోయేలా ఉంది , పర్ఫెక్షన్ కోసం అలా తీసుకువచ్చారు అని నాగ శౌర్య ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు.