ఆది - నిక్కీ గల్రాని లవ్ స్టోరీ లో ఈ ట్విస్ట్ మీకు తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలు కూడా పోషించి ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి సినిమాలో మరో కీ రోల్ పోషించాడు. ఇక ఇది ఇలా ఉంటే త్వరలోనే ఆది పినిశెట్టి ఒక ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. తనతో కలిసి నటించిన హీరోయిన్ నిక్కీ గల్రాని ని ఆది పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఇద్దరూ జంటగా మలుపు అనే సినిమాలో నటించారు. ఇక ఈ సినిమాతో రీల్ జోడిగా గా ఆకట్టుకున్న వీళ్ళు.. ఇప్పుడు రియల్ జంట గా మారబోతున్నారు. 

ఇక తెలుగులో నిక్కీ గల్రాని.. సునీల్ హీరోగా తెరకెక్కిన కృష్ణాష్టమి సినిమాలో నటించింది. అయితే అంతకు ముందే ఆది తో మలుపు సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మరోసారి ఆది సరసన మరకతమణి సినిమాలో నటించింది. కాగా మలుపు సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. ఇక ఆ ప్రేమ కాస్త మరకతమణి సినిమాతో బల పడిందట. ఆ సినిమాలో నిక్కీ ని ఆరాధించే ప్రేమికుడిగా కనిపిస్తాడు ఆది. అయితే అది నటన కాదట. నిజంగానే ఆ సమయంలో నిక్కీ పై ఆది కి ప్రేమ ఉండేదట. అందుకే ఆ సినిమాలో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

సినిమాలో చాలా కూల్ గా దూరం నుంచే హీరోయిన్ ని ఆరాధిస్తూ ఉంటాడు హీరో. అయితే వాస్తవానికి సినిమాల్లో నటించగా ముందే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఉందట. ఇక సినిమాల్లో కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్త ప్రేమగా బలపడి అది తారా స్థాయికి చేరిపోయింది. అయితే వైవాహిక జీవితంలో ఇద్దరూ కలిసి సక్సెస్ఫుల్గా ముందడుగు వేయగలమా? లేదా? అనే ఆలోచనలో పడ్డ వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఇంత సమయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆది స్వయంగా చెప్పడం విశేషం. ఇక తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆది నిక్కీ గల్రాని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: