మిల్కీ బ్యూటీ తమన్నా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో ఫుల్ క్రేజ్ ను తెలుగు ఇండస్ట్రీ లో సంపాదించుకుంది, ఇలా హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నాకు ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది, తమన్నా కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి ఆ ప్రాంతాల్లో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది, ఇది ఇలా ఉంటే తమన్నా సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లు , స్పెషల్ సాంగ్ లు , టీవీ షో లతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది.
ఇలా ఇది ఇలా ఉంటే తమన్నా ప్రస్తుతం కూడా పర్వాలేదు అనే రేంజ్ ఆఫర్ లతో కెరియర్ ను ముందుకు సాగిస్తోంది, అందులో భాగంగా తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన కథానాయికగా నటిస్తోంది, ఇది వరకే మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో హీరోయిన్ గా నటించింది, భోళా శంకర్ సినిమా లో చిరంజీవి సరసన తమన్నా రెండవ సారి నటిస్తోంది. ఈ సినిమాతో పాటు తమన్నా, వెంకటేష్ సరసన ఎఫ్ 3 సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది, ఇలా ఈ రెండు సినిమాలలో హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా, వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించింది. గని మూవీ లోని స్పెషల్ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది, ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటూనే స్పెషల్ సాంగ్ లతో కూడా తమన్నా ప్రేక్షకులను అలరిస్తుంది.