ఆర్.ఆర్.ఆర్ సినిమాకు రిపీట్ ఆడియన్స్ వస్తారా...?
ప్రస్తుతం టాలీవుడ్ నిర్మాతల ప్రధాన ఆదాయ వనరులలో ఓటీటీ హక్కులు కూడా ఒకటని తెలుస్తుంది.. బాహుబలి మరియు బాహుబలి2 సినిమాలకు రిపీట్ ఆడియన్స్ రావడం ఆ సినిమాలకు కలిసొచ్చింది. ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అద్భుతంగా ఉండటంతో చరణ్ మరియు తారక్ అభిమానులు మళ్లీమళ్లీ ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే టికెట్ రేట్లు మరీ ఎక్కువగా ఉండటం వల్ల కొందరు అభిమానులు సినిమాను రెండోసారి థియేటర్లలో చూడటానికి వెనుకాడుతున్నారు.
రెండు నెలల తర్వాత ఆర్ఆర్ఆర్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో ఒకసారి చూసిన మరి కొందరు అభిమానులు ఆగిపోతున్నారట. అయితే రిపీట్ ఆడియన్స్ వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా కలెక్షన్లు భారీస్థాయిలో పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. తెలంగాణలో సోమవారం తర్వాత, ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ తర్వాత టికెట్ రేట్లు తగ్గనున్న నేపథ్యంలో రిపీట్ ఆడియన్స్ ఈ సినిమాపై దృష్టి పెడతారేమో చూడాలి మరి. ఆర్ఆర్ఆర్ కు పాజిటివ్ టాక్ రావడంతో హిందీలో అలాగే ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ అంతకంతకూ పెరుగుతున్నాయిట.
బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమాను తెగ మెచ్చుకుంటున్నారని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి మరి. రికార్డు స్థాయి స్క్రీన్లలో హిందీలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడం ఈ సినిమాకు బాగా ప్లస్ అవుతోంది.