ఆర్ ఆర్ ఆర్ లో రాజమౌళి పొరపాట్లు !
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ 1920 ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ లు ఒక అజ్ఞాత ప్రదేశంలో కలిసారు అని అల్లబడిన కథ. ఇక్కడే జక్కన్న పొరపాటు చేసాడా అన్నది విమర్శకుల అభిప్రాయం. చరిత్రలో ఎక్కడా కనిపించని ఒక ఊహ చుట్టూ అల్లబడ్డ ఈకథలో కృత్రిమమైన ఎమోషన్ తప్ప సహజసిద్ధమైన ఎమోషన్ ను అదేవిధం ఉద్వేగాన్ని రగిల్చే దేశభక్తిని రాజమౌళి చూపించలేకపోయాడు అని కొందరి అభిప్రాయం.
ఇదిచాలదు అన్నట్లుగా ఒక పాపకు సంబంధించిన కథ చుట్టూ ఈమూవీ తిరగడం వలన కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ లో సహజత్వం లోపించింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు చరిత్రలో ఎంతో ప్రత్యేక కంచి త్యాగాలు చేసిన అల్లూరి కొమరం భీమ్ పాత్రలతో ‘నాటు నాటు’ పాట స్టెప్స్ ఏమిటి అంటూ మరికొందరి తమ అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. రాజమౌళి సినిమాలు అంటే హీరో పాత్రకన్నా విలన్ పాత్రను చాల ఎలివేట్ చేసి చూపెడతాడు.
అయితే ఈతీరుకు భిన్నంగా ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో విలన్ పాత్రలో నటించిన బ్రిటీష్ నటుడు రాయ్ స్టీవెన్సన్ చాల బలహీనంగా ఎటువంటి పవర్ ఫుల్ ఎమోషన్స్ కనిపించకుండా నటించడం కూడా ఈమూవీకి ఒక మైనస్ పాయింట్ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈమూవీ సెకండ్ ఆఫ్ లో సన్నివేశాలలో స్పీడ్ కనపరచక పోవడంతో పాటు సరైన రొమాంటిక్ సీన్స్ లేకపోవడం కూడ ఈమూవీకి మరొక మైనస్ పాయింట్ గా మారే ఆస్కారం ఉంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో కేవలం బ్రాండ్ ఇమేజ్ వేల్యూ చరణ్ జూనియర్ల క్రేజ్ ఎంతవరకు పాన్ ఇండియా స్థాయిలో ఈమూవీ దర్శక నిర్మాతలు బయ్యర్లు కోరుకుంటున్న 1000 కోట్ల టార్గెట్ ను రీచ్ కాగలుగుతుంది అన్న విషయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..