ఆ హీరో కోసం యాక్టీవ్ అయిన పూజ హెగ్డే!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజాహెగ్డే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన `బీస్ట్` సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది.దీంతో యూనిట్ ప్రచారం పనుల్ని స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పూజాహెగ్డే ఈ సినిమా ప్రచారం పనుల్లో ఎంతో ఉత్సాహం చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమాలో ఓ ప్రమోషనల్ సాంగ్ కి సంబంధించిన ఫోటోని ఇన్ స్టాలో స్వయంగా పూజాహెగ్డేనే పోస్ట్ చేసింది.ఈ పోస్ట్ లో విజయ్ -పూజాహెగ్డే- అనిరుద్ - కొరియాగ్రాఫర్ సాంగ్ షూట్ మధ్యలో ఇలా ఫోటో దిగినట్లు తెలుస్తోంది. నలుగురు రంగుల దుస్తుల్లో వెలిగిపోతున్నారు. ఇక ఈ పాట కోసం ప్రత్యేకంగా సెట్ నిర్మించి షూట్ చేసినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే పూజా హెగ్డే ఇలా `బీస్ట్` ఫోటోని పోస్ట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది వరకు `రాదేశ్యామ్` ప్రచారం పనుల్లో పాల్గొంది.అప్పుడు ఏదో మొక్కుబడిగా పాల్గొన్నట్లు ఆమె కనిపించింది. ప్రభాస్ పక్కనే ఉన్నా కాని ఆమె మూతి బిగించికుని కనిపించింది.


హీరో-హీరోయిన్ల మధ్య సినిమాలో కెమిస్ర్టీ చూడాలి తప్ప బయట కాదంటూ ఇంటర్వ్యూయర్ ప్రశ్నకి పూజా హెగ్డే సెటైరికల్ గా కూడా బధులిచల్చింది. ఇన్ స్టా అకౌంట్లో `రాధేశ్యామ్` సినిమాకి సంబంధించి ఎలాంటి పోస్ట్ కూడా ఆమె ముందుగా చేయలేదు.దీంతో కొంత మంది నెటి జనులు ఆ రెండు సందర్భాల్ని ఇప్పుడు గుర్తుచేస్తూ అప్పుడు లేని ఉత్సాహం పూజాహెగ్డే కి ఒక్కసారిగా ఇప్పుడెలా కట్టలు తెచ్చుకుని వచ్చేసినట్లు అంటూ తిడుతూ కామెంట్లు చేస్తున్నారు. పైగా హీరో విజయ్ తో చేతిలో చేయి పెట్టి మరీ క్యామ్ కి ఫోజులివ్వడం ఇంకా అందులోనూ నేరుగా ఆమె ఇంస్టా అకౌంట్ లోనే పోస్ట్ చేయడంతో డార్లింగ్ అభిమానులు ఒకింత కోపానికి గురవుతున్న సన్నివేశం కనిపిస్తుంది.ఇక బుట్టబొమ్మ పూజాహెగ్డే సినిమాల లైనప్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `ఆచార్య`సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించింది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా రిలీజ్ కి రెడీ గా ఉంది. ఇక అలాగే బాలీవుడ్ లో స్టార్ హీరో రణవీర్ సింగ్ సరసన `సిర్కస్` లో నటిస్తోంది. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా మరో రెండు ప్రాజెక్ట్ లకు పూజా సైన్ చేసినట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: