గంగూబాయి కతియవాడి సినిమా కోసం థియేటర్ మొత్తం బుక్ చేసిన పాకిస్తాన్ మోడల్..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు,  ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ మూవీ ల ద్వారా ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.  ఇలా ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ లో హీరోయిన్ గా నటించింది,  రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్ ,  జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తం గా భారీ ఎత్తున విడుదలకు సిద్ధం గా ఉంది. ఇది ఇలా ఉంటే ఆలియా భట్ ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం లో తెరకెక్కిన గంగూబాయి కతియవాడి సినిమా ఫిబ్రవరి 25 వ తేదీ న విడుదలై ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న విషయం మన అందరికీ తెలిసిందే,  మాఫీయా క్వీన్‌, వేశ్య పాత్రలో ఆలియా భట్ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  


ఇప్పటి వరకు గ్లామర్‌ రోల్స్‌ తో అలరించిన ఆలియా భట్  ఈ మూవీ లో వైవిధ్యమైన నటన తో ప్రేక్షకులను, విమర్శకులను ఆశ్చర్యపరిచింది,  ఇది ఇలా ఉంటే ఆలియా భట్ నటించిన గంగూబాయి కతియవాడి మూవీ ని చూసేందుకు ఒక అభిమాని ఏకంగా థియేటర్‌నే బుక్‌ చేశాడు.  పాకిస్తాన్‌కు చెందిన మోడల్‌, యాక్టర్‌ మునీబ్ బట్‌ అందాల ముద్దుగుమ్మ ఆలియా భట్ కు వీరాభిమాని ఈ అభిమానం తోనే గంగుబాయి కతియవాడి సినిమాని తన భార్య తో కలిసి చూసేందుకు మొత్తం థియేటర్‌ నే బుక్‌ చేశాడు.  తాను ఈ విషయాన్ని  ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: