ఆ ఫోటో షేర్ చేసి పండగ చేస్కోండి అంటున్న కాజల్!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ కొన్ని నెలలుగా బేబి బంప్ లుక్ తో ఇన్ స్టాలో దర్శనమిస్తోన్న సంగతి తెలిసిందే. కాజల్ గర్భం దాల్చిన దగ్గర నుంచి బేబి బంప్ ఫోటోల్ని ఇన్ స్టాగ్రామ్ లోకి అదే పనిగా డంప్ చేస్తుంది.బుజ్జాయి ఊహల్లో తేలుతూ అదే రెట్టించిన ఉత్సాంహంతో కాజల్ అగర్వాల్ ఫోటో సెషన్స్ లో పాల్గొంటుంది. విభిన్న రకాల క్యాజువల్ వేర్స్ లో బేబి బంప్ లుక్ తో నెటిజనుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది చందమామ.ఇక ఇప్పటి వరకూ కూడా వారంలో మూడు ..నాలుగు ఫోటోలు చొప్పున కవర్ చేసుకుంటూ వచ్చింది. తాజాగా బేబీ బంప్ లుక్ కి గ్యాప్ ఇచ్చింది ఈ బ్యూటీ. తన పాత ఫోటోని ఇన్ స్టాలో అభిమానుల కోసం పండగ చేస్కోండని అంటూ షేర్ చేసింది.ఇక కాజల్ గర్భం దాల్చక ముందు క్యాప్చర్ చేసిన ఓ మ్యాగజైన్ ఫోటోని ఆమె సోషల్ మీడియాలోకి వదిలింది.ఇందులో తన క్యూట్ స్మైల్ తో చందమామని మరిపిస్తూ ఆకట్టుకుంటుంది. చాలా నెలలు గ్యాప్ తర్వాత కాజల్ ఇలా హీరోయిన్ లుక్ లో కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

కాజల్ అగర్వాల్ ఫ్యాన్స్ అందాన్ని తనివి తీరా చూసి ఆస్వాదిస్తున్నారు. మొత్తానికి చందమామ పాత ఫోటోతో అభిమానులకు కొత్త కిక్ ని ఇచ్చిందని చెప్పాలి. ప్రస్తుతం ఈ ఫోటో అయితే నెట్టింట తెగ వైరల్ గా మారాయి.ప్రస్తుతం కాజల్ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన `ఆచార్య` సినిమాలో నటిస్తోంది. మెగాస్టార్ తో కలిసి నటించడం ఇది రెండవ సారి. గతంలో `ఖైదీ నెంబర్ 150` సినిమాలో మెగాస్టార్ కి జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా అప్పుడు పెద్ద హిట్ అయ్యి కాజల్ కి కంబ్యాక్ ఇచ్చింది.ఇక అదే సెంటిమెంట్ తో కొరటాల శివ మరోసారి కాజల్ ని చిరు సరసన `ఆచార్య`లో హీరోయిన్ గా రిపీట్ చేసారు. అలాగే `ఇండియన్ -2` లో విశ్వ నటుడు కమల్ హాసన సరసన నటిస్తోంది. ఇక ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. కాజల్ అగర్వాల్ పై చిత్రీకరణకు సంబంధించి దాదాపు షూట్ కూడా పూర్తయినట్లు సమాచారం. కాజల్ గర్భం దాల్చిన తర్వాత షూటింగ్ లకు చాలా దూరమైంది. దీంతో ఆమెకు ఛాన్స్ లు రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: