ఆర్ ఆర్ ఆర్ లో మిగిలిన విషయాలు !
ఈసినిమాలోని కీలక ఫైట్స్ అన్నీ హైదరాబాద్ చివరిలో ఉన్న పాత అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ఆర్ ఆర్ ఆర్ కోసం భాగ్యనగరం చివరిలో 100 ఎకరాల బీడు భూమిని లీజ్ కు తీసుకుని అక్కడ ప్రత్యేకంగా భారీ సెట్స్ వేయడమే కాకుండా ఈసినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు అక్కడ చిత్రీకరించారు. ఇప్పుడు రష్యా దాడులతో నాశనం అయిపోతున్న ఉక్రెయిన్ లో ఈమూవీకి సంబంధించిన పాటలు చిత్రీకరించారు.
ఈమూవీకి సంబంధించి లీజుకు తీసుకున్న 100 ఎకరాల భూమిలో రాజమౌళి అతడు కుటుంబసభ్యులు ఉండటానికి ఒక ప్రత్యేకమైన తాత్కాలిక ఇంటిని నిర్మించారు. సకల వసుతులతో ఉండే ఆఇంటికే మూడు కోట్లు ఖర్చు అయిందట. అదేవిధంగా ఈమూవీ షూటింగ్ చాలసార్లు అర్థరాత్రి వరకు ఉండే నేపధ్యంలో ఆ 100 ఎకరాల పొలంలోని ఈసినిమా యూనిట్ సభ్యులకు ప్రత్యేకమైన కాటేజ్ లు కట్టారట.
ఇక ఈసినిమాకు వచ్చే లాభంలో రాజమౌళికి 50శాతం అని వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో ఈమూవీ ద్వారా రాజమౌళికి వచ్చే పారితోషికం 100 కోట్ల పై చిలుకు అని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఈస్థాయిలో పారితోషికం తీసుకున్న దర్శకులు ఎవరు లేరు అని అంటున్నారు. ఈమూవీ షూటింగ్ అర్థరాత్రి వరకు జరిగినప్పటికీ తిరిగి 5గంటలకే యూనిట్ సభ్యులు అందర్నీ నిద్రలేచే విధంగా వత్తిడి చేయడమే కాకుండా యూనిట్ సభ్యులందరికీ ప్రత్యేకంగా యోగా ధ్యానం క్లాసులు కూడ ఏర్పాటు చేయించారట. షూటింగ్ సమయంలో యూనిట్ నెంబర్స్ దగ్గర సెల్ ఫోన్స్ ఏమిలేకుండా జాగ్రత్తలు తీసుకుని వారందరికీ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ తప్ప మరో ప్రపంచం లేకుండా తాను ఏకాగ్రతతో ఉండటమే కాకుండా తన యూనిట్ సభ్యులతో ఏకాగ్రతతో ఒక యజ్ఞం లా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ ను పూర్తి చేసాడట..